2024లో HYDలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు తెచ్చిపెట్టే ఏరియాలు!

2024లో హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? మరి ఏ ఏరియాల్లో పెట్టుబడి పెడితే లాభాలు ఉంటాయి అనే వివరాలు మీ కోసం.

2024లో హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? మరి ఏ ఏరియాల్లో పెట్టుబడి పెడితే లాభాలు ఉంటాయి అనే వివరాలు మీ కోసం.

హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ ఏరియాలు అంటే ఒక 10 ఉన్నాయి. కోకాపేట్, నార్సింగి, తెల్లాపూర్, బాచుపల్లి, కొండాపూర్, ప్రగతి నగర్, మణికొండ, కొంపల్లి, శంకర్ పల్లి, రాజేంద్ర నగర్ ఏరియాలు ప్రస్తుతం హైదరాబాద్ లో బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఏరియాలుగా ఉన్నాయి. మరి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఉన్న అర్హతలు ఏంటి? ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి? వంటి వివరాలు మీ కోసం. 

కోకాపేట్: 

సిటీలో ఎక్కువ మంది నివాసం ఉండడానికి కోరుకునే ఏరియాల్లో కోకాపేట్ ముందుంది. ఐటీ కారిడార్ కి దగ్గరగా ఉండడం.. సిటీలో మిగతా ప్రాంతాలకు కనెక్టివిటీ అద్భుతంగా ఉండడం.. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్ కి ఐడియల్ గా ఉండడం వంటి వాటి కారణంగా కోకాపేట్ ఏరియా ఇన్వెస్టర్ల బెస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఐటీ హబ్స్ కి బాగా దగ్గరగా ఉండడంతో ఐటీ వాళ్ళు ఇక్కడ స్థలాలు, ఫ్లాట్ లు కొనేందుకు ముందుకొస్తున్నారు. దీని వల్ల డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇక్కడ స్థలం కొనాలంటే చదరపు అడుగుకి రూ. 5,650 నుంచి రూ. 16,650 పడుతుంది. యావరేజ్ రేటు వచ్చేసి రూ. 7,600 ఉంది.       

నార్సింగి:

కోకాపేట్ తర్వాత పెట్టుబడికి అనుకూలంగా ఉన్న ఏరియా నార్సింగి. వెస్టర్న్ హైదరాబాద్ పొలిమేరల్లో ఉన్న నార్సింగి పాపులర్ రెసిడెన్షియల్ ఏరియాగా ఉంది. బెస్ట్ ఎక్స్ క్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, హైటెక్ సెక్యూరిటీకి ఈ ఏరియా ప్రసిద్ధి. గండిపేట్, కోకాపేట్, మణికొండ లాంటి రెసిడెన్షియల్ ఏరియాలకు అవుటర్ రింగ్ రోడ్ ద్వారా ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఈ నార్సింగి ప్రాంతం ఉంది. ఇక్కడ చదరపు అడుగు స్థలం రూ. 5,450 నుంచి రూ. 10,900 రేంజ్ లో ఉంది.     

కొంపల్లి:

రెసిడెన్షియల్ అండ్ ఇండస్ట్రియల్ సెంటర్ గా కొంపల్లి కూడా వేగంగా డెవలప్ అవుతోంది. సిటీలో ఇతర ప్రాంతాలతో కనెక్ట్ అయ్యే విధంగా అవుటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉంది. గత కొన్నేళ్లలో ఇక్కడ పలు ఫేమస్ స్కూళ్ళు, కాలేజీలు, రెస్టారెంట్లు, పార్క్ లు, షాపింగ్ సెంటర్స్ వంటివి రావడంతో ఇక్కడ ప్రాపర్టీ కొనేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. కొంపల్లిలో చదరపు అడుగు రూ. 3,900 నుంచి మొదలువుతుంది. 

తెల్లాపూర్:

తెల్లాపూర్ కూడా ఇన్వెస్ట్ మెంట్ కి అనుకూల ప్రదేశం. అవుటర్ రింగ్ రోడ్ కి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పాపులర్ లొకేషన్స్ కి దగ్గరగా ఉంది. ఇక్కడ స్థలం రేటు చదరపు అడుగు రూ. 3,350 నుంచి రూ. 5,900 మధ్యలో ఉంది. 

బాచుపల్లి:

బాచుపల్లి కూడా బెస్ట్ రెసిడెన్షియల్ ఏరియాగా అభివృద్ధి చెందుతూ ఉంది. పాఠశాలలు, కళాశాలలు, మాల్స్, రెస్టారెంట్స్, ఫిట్ నెస్ సెంటర్స్ వంటివి బాచుపల్లిలో ఉన్నాయి. ఇక్కడ స్థలం రేటు చదరపు అడుగు రూ. 4,800 నుంచి రూ. 6,600 మధ్యలో కొనసాగుతుంది. 

కొండాపూర్:

హైదరాబాద్ లో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని ఎదురుచూసేవారికి కొండాపూర్ బెస్ట్ ఆప్షన్. సిటీ సెంటర్ కి దగ్గరగా ఉండడం.. సిటీలో ఏ చోటకి వెళ్లాలన్నా కూడా కనెక్టివిటీ చాలా బాగుంటుంది. క్వాలిటీ రోడ్స్, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి కొండాపూర్ సొంతం. ఇక్కడ స్థలం రేట్లు చదరపు అడుగు రూ. 5,750 నుంచి రూ. 16,400 మధ్య కొనసాగుతుంది.  

ప్రగతి నగర్: 

హైదరాబాద్ లోని ప్రధాన కమర్షియల్ ఏరియాలకు ఈ ప్రగతి నగర్ దగ్గరగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్, రియల్ ఎస్టేట్ గ్రోత్ వంటి కారణాలతో ప్రగతి నగర్ ఏరియా అనేది పెట్టుబడికి అనుకూలంగా ఉంది. సిటీలోని ఇతర ప్రాంతాలతో ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఈ ఏరియా ఉంది. ఇక్కడ స్థలాల రేట్లు చదరపు అడుగు రూ. 8,150 నుంచి రూ. 12,950 మధ్యలో ఉంది.   

మణికొండ:

మణికొండ కూడా బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఏరియాగా ఎదుగుతుంది. కమర్షియల్ హబ్స్ కి దగ్గరగా ఉండడం, ఐటీ ప్రెజెన్స్ పెరుగుతుండడం వంటి కారణాల వల్ల ఈ ఏరియాలో రేట్లు బాగా పెరిగాయి. ఫ్యూచర్ లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ స్థలం రేటు చదరపు అడుగు రూ. 12,650 గా ఉంది. 

శంకర్ పల్లి:

హైదరాబాద్ లో బెస్ట్ ప్లేస్ లో ఉన్న ఏరియాగా శంకర్ పల్లి ఏరియా ఉంది. సిటీ గ్రీన్ బెల్ట్ గా శంకర్ పల్లి ఉంది. ఉన్నతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యాసంస్థలు, హాస్పిటల్స్ వంటివి ఉండడం.. పబ్లిక్, ప్రైవేట్ రవాణా మార్గాల ద్వారా సిటీలోని ఇతర ప్రాంతాలకు సులువుగా చేరుకునే సదుపాయం ఉండడం వల్ల శంకర్ పల్లి బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఏరియాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్యూచర్ గ్రోత్ అనేది కనబడుతుంది. ఇక్కడ స్థలం రేటు చదరపు అడుగు రూ. 1900 నుంచి రూ. 2,500 మధ్యలో కొనసాగుతుంది. 

రాజేంద్ర నగర్:

హైదరాబాద్ లో భూమ్మీద పెట్టుబడి పెట్టాలంటే కనుక రాజేంద్ర నగర్ గ్రేట్ ఆప్షన్ గా ఉంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై గ్రేడ్ సెక్యూరిటీ, మెరుగైన రవాణా మరియు కనెక్టివిటీ కలిగి ఉంది. హైదరాబాద్ ఫేమస్ ల్యాండ్ మర్క్స్ కి దగ్గరగా అలానే బేగంపేట్, హైటెక్ సిటీ వంటి బిజినెస్ డిస్ట్రిక్ట్స్ కి మంచి కనెక్టివిటీ కలిగి ఉంది. ఇక్కడ స్థలాల రేట్లు చదరపు అడుగు రూ. 5 వేలు, రూ.  వేలు, రూ. 8 వేలు రేంజ్ లో ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ ధర కూడా పలికేవి ఉన్నాయి. 

ఇవే 2024లో హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టడానికి అనువుగా ఉన్న ఏరియాలు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ రెంటల్స్ కి భారీ డిమాండ్ ఉంది. స్థలం కొని ఒక ఇల్లు కట్టి రెంటికిస్తే మంచి లాభం ఉంటుంది. 

  • గమనిక: ఈ రేట్లు అనేవి ఆయా రియల్ ఎస్టేట్ వెబ్ సైట్ల నుంచి సేకరించి ఇవ్వబడినవి. ధరల్లో కొద్దిగా మార్పులు ఏమైనా ఉంటే ఉండవచ్చు.
Show comments