Discount On Cars: కొత్త కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ కష్టం!

కారు కొనాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. కార్ల కంపెనీలు ఇప్పుడు లక్షల్లో డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తోందో తెలుసుకోండి.

కారు కొనాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. కార్ల కంపెనీలు ఇప్పుడు లక్షల్లో డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తోందో తెలుసుకోండి.

కారు కొనాలి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి కల. కానీ, ఆర్థిక అడ్డంకుల వల్ల చాలా మంది ఆ కలను నెరవేర్చుకోవడానికి కాస్త సమయం తీసుకుంటారు. ఇంకొంత మంది మాత్రం అనుకున్నదే తడవుగా కొత్త కారును కొనేస్తుంటారు. అయితే కారు కొనే ముందు ఒకటి ఆలోచించాలి. ఆ కారు మీ బడ్జెట్ లో ఉందా? లేదా? ఫీచర్స్ కోసం ఎక్కువ ధర కార్లను కొనుగోలు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే కొత్త కారు కొనాలి అనుకునే వారికి ఇప్పుడు కంపెనీలు చాలానే ఆఫర్లను ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడైతే లక్షల్లో కూడా డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. అటు ఎలక్ట్రిక్ కార్ల మీద కూడా లక్షల్లో డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. అయితే ఏ కంపెనీ ఎంత డిస్కౌంట్ ఇస్తోందో ఒకసారి చూద్దాం.

సాధారణంగా సేల్స్ పెంచుకోవడం కోసం కారు కంపెనీలు ఏడాది పొడవునా ఎంతో కొంత డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కావడంతో కంపెనీలు మరింత డిస్కౌంట్స్ ని ప్రకటిస్తున్నాయి. నిజానికి కారు కొనాలి అనుకునే వారికి ఇది సరైన సమయం అని కూడా చెప్పచ్చు. సాధారణ సమయంతో పోలిస్తే ఇలాంటి సమయంలో కాస్త ఎక్కువగానే ధరలను తగ్గిస్తూ ఉంటారు. మీరు కొత్త కారు కొనాలని చూస్తుంటే మాత్రం ఈ సమయాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు. కారు ఆన్ రోడ్ ప్రైస్ మీద 100 శాంతం వరకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి కూడా. అంటే మీరు కొనే కారు విలువ మొత్తాన్ని లోన్ కింద పొందవచ్చు. కాకపోతే మీ దగ్గర డబ్బులుంటే డౌన్ పేమెంట్ కట్టి కొనుగోలు చేయడమే మంచిది. అలా కాదంటే మీరు వడ్డీ కింది ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.

డిస్కౌంట్స్ ఇలా:

ప్రస్తుతం మారుతీ సుజుకీ కంపెనీ అందరి కంటే ఎక్కువ మోడల్స్ పై డిస్కౌంట్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదల చేసిన జిమ్నీ మోడల్ పై ఏకంగా రూ.2.21 లక్షల వరకు డిస్కౌంట్ ని ప్రకటించింది. ఊహించిన స్థాయి సేల్స్ రాలేదనే ఇలాంటి తగ్గింపు ప్రకటించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత ఇగ్నిస్ మోడల్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. మనీ డిస్కౌంట్ రూ.40 వేలు, ఎక్స్ ఛేంజ్ బోనస్ కింద రూ.15 వేలు అందిస్తోంది. అంటే ఇగ్నిస్ కారుపై మొత్తం రూ.55 వేల వరకు డిస్కౌంట్స్ పొందచ్చు. హాట్ సెల్లింగ్ మోడల్ బలేనోపై.. మనీ డిస్కౌంట్ రూ.30 వేలు, ఎక్స్ ఛేంజ్ బోనస్ రూ.10 వేలు అందిస్తోంది.  అలాగే.. ఎస్యూవీ మోడల్ ఫ్రాంక్స్ పై రూ.15 వేలు మనీ డిస్కౌంట్- రూ.10 వేల ఎక్స్ ఛేంజ్ బోనస్ తో కలిపి రూ.25 వేల వరకు ఆఫర్ చేస్తున్నారు. ఇంక గ్రాండ్ వితారాపై రూ.15 డిస్కౌంట్స్ అందిస్తున్నారు.

EVలపై లక్షల్లో డిస్కౌంట్స్:

ప్రస్తుతం మార్కెట్లో ఈవీ కార్లపై క్రేజ్ కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. అందుకేనేమో కంపెనీలు డిస్కౌంట్స్ ని లక్షల్లో అందిస్తున్నాయి. మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ మోడల్ పై అత్యధికంగా రూ.4.2 లక్షల వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. అలాగే XUV 300 టాప్ మోడల్ పై రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంతేకాకుడాం ఫోక్స్ వేగన్ కంపెనీ కూడా తమ టైగన్ ఎలక్ట్రిక్ మోడల్ పై మనీ డిస్కౌంట్, ఎక్స్ ఛేంజ్ బోనస్ తో కలుపుకు అత్యధికంగా రూ.4.2 లక్షల వరకు డిస్కౌంట్స్ ఇస్తోంది. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వేరియంట్లపై డిస్కౌంట్స్ ని ప్రకటిస్తున్నాయి. ఇయర్ ఎండింగ్ కాబట్టే కంపెనీలు ఇలాంటి డిస్కౌంట్స్ అందిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ డిస్కౌంట్స్ కి సంబంధించి కచ్చితమైన సమాచారం కోసం ఒకసారి డీలర్ ని సంప్రదిస్తే మంచిది. ఎందుకంటే ప్రాంతాలు, డీలర్స్, వేరియంట్స్ ని బట్టి ఈ డిస్కౌంట్స్ తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. మరి.. కార్ల కంపెనీలు అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments