Gold Price Drop On July 31 2024

Gold Price: భారీ ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. నేడు ఎంత తగ్గిందంటే..

Today Gold Price Drop: క్రితం రెండు సెషన్లలో పెరిగిన బంగారం ధర నేడు మాత్రం భారీగా దిగి వచ్చింది. ఇవాళ దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర ఎంత ఉంది అంటే..

Today Gold Price Drop: క్రితం రెండు సెషన్లలో పెరిగిన బంగారం ధర నేడు మాత్రం భారీగా దిగి వచ్చింది. ఇవాళ దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర ఎంత ఉంది అంటే..

బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి మన దేశంలో గోల్డ్‌ రేటు పడిపోతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లతో సంబంధం లేకుండా.. దేశీయ బులియన్‌ మార్కెట్‌లో మాత్రం పసిడి ధర దిగి వస్తూనే ఉంది. పైగా పండగల సీజన్‌ వచ్చేస్తుంది. మరి కొన్ని రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఇక వరుస పండుగలు ఉన్న నేపథ్యంలో పసిడి కొనుగోళ్లు ఊపందుకుంటాయి. రేటు ఇలా దిగి వస్తే.. ఈ శ్రావణంలో బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.ఇక గత 2 నెలలుగా భారీగా పెరిగిన బంగారం రేట్లు.. బడ్జెట్‌లో కేంద్రం సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి వరుసగా దిగి రాసాగింది. ఈ వారం వ్యవధిలోనే తులం రేటు ఏకంగా రూ. 7 వేల వరకు తగ్గింది. అయితే క్రితం రెండు సెషన్లలో పెరిగిన గోల్డ్‌ రేటు.. నేడు మరోసారి దిగి వచ్చింది. మరి ఇవాళ దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పుత్తడి ధర ఎంత ఉంది అంటే..

నేడు హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర భారీగా దిగి వచ్చింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల రేటు రూ. 200 పడిపోయి 63,200 రూపాయలకు దిగి వచ్చింది. అంతకుముందు రెండు సెషన్లలో ఇది రూ. 150, రూ. 250 చొప్పున పెరిగింది. ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు కూడా దిగి వచ్చింది. స్వచ్ఛమైన గోల్డ్‌ పది గ్రాముల ధర  210 రూపాయల మేర దిగి వచ్చి.. రూ.68,950 పలుకుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం రేటు దిగి వచ్చింది. హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు రూ. 200 తగ్గి ప్రస్తుతం రూ. 63,350 వద్దకు చేరింది. అలానే 24 క్యారెట్స్‌ మేలిమి బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 210 పడిపోయి రూ. 69,100 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్‌ రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర కారణాలు.. బంగారం రేటు పెరిగేందుకు దోహదం చేస్తాయి. దీని కారణంగా ప్రాంతాల్ని బట్టి ధరల్లో వ్యత్యాసం గమనించొచ్చు.

భారీగా దిగి వచ్చిన సిల్వర్‌ రేటు..

నేడు బంగారం ధర దిగి రాగా.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ ఢిల్లీలో ఒక్కరోజులో కిలో వెండి మీద ఏకంగా రూ. 500 తగ్గింది. దాంతో ప్రస్తుతం హస్తినలో కిలో వెండి ధర రూ. 84,500కి దిగి వచ్చింది. అయితే క్రితం సెషన్‌లో మాత్రం సిల్వర్‌ రేటు.. కిలో మీద రూ. 500 పెరిగింది. భాగ్యనగరంలో నేడు వెండి ధర భారీగానే దిగి వచ్చింది. కేజీ మీద 500 పడిపోయి.. 89 వేల మార్కు వద్ద కొనసాగుతుంది.

Show comments