మహిళలకు గుడ్‌న్యూస్.. వరుసగా 3వ రోజు తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Today Gold and Silver Rates: ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు తరుచూ మారుతూ వస్తున్నాయి. ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో కొనుగోలుదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏది ఏమైనా బంగారం డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.

Today Gold and Silver Rates: ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు తరుచూ మారుతూ వస్తున్నాయి. ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో కొనుగోలుదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏది ఏమైనా బంగారం డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.

భారతీయులకు బంగారంతో విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యంగా పండగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు మహిళలకు తప్పకుండా బంగారం, వెండి కొనుగోలు చేస్తుంటారు. గత ఏడాది నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండు నెలల క్రితం భారీగా పెరిగిన పసిడి ఆగస్టులో తగ్గుముఖం పట్టింది. ఈ నెల కూడా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం నాలుగు రోజులు పెరిగిపోతూ వస్తుంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు బంగారం, వెండి ధరలపై పడుతున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. నేడు మార్కట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

మగువలకు గుడ్‌న్యూస్.. నిన్నటి నుంచి పుత్తడి ధరలు మళ్లీ తగ్గుతూ వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం పెరిగిన బంగారం ధరలు వరుసగా తగ్గడంతో కోనుగోలుదారుల సంఖ్య మళ్లీ పెరిగిపోయింది.దానికి తోడు వరుసగా పండుగలు, శుభకార్యాలు మొదలు కావడంతో మహిళలు గోల్డ్ కొనుగోలు చేసేందుకు జ్యులరీషాపులకు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య పసిడి కేవలం ఆభరణాలుగానే కాకుండా భవిష్యత్ లో దేనికైనా ఇన్వెస్ట్ చేయవొచ్చు అన్న నమ్మకం మద్యతరగతి కుటుంబీకులు భావిస్తున్నారు. గురువారం (సెప్టెంబర్ 19) నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,రూ.68,240వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,రూ.74,440 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,440 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,590 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,440 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,440 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి పై రూ.100 తగ్గి రూ.90,900 వద్ద కొనసాతుంది. చెన్నై, హైదరాబాద్, వరంగల్, విజయవాడలో రూ.95,900 గా ఉంది. ఢిల్లీ, కేరళా, ముంబాయి లో కిలో వెండి ధర రూ.90,900, బెంగుళూరు లో కిలో వెండి రూ.85,900 వద్ద కొనసాగుతుంది.

 

Show comments