పండగపూట మురిపమే.. మళ్లీ షాక్ ఇచ్చిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Rates: మహిళలు ఎంతగానో ఇష్టపడే పసిడి ధరలు శుక్రవారం వరకు తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు నిన్న వరలక్ష్మీ వ్రతం కావడంతో మహిళలు పసిడి కొనుగోలు చేయడానికి జ్యులరీ షాపులకు క్యూ కట్టారు.

Gold and Silver Rates: మహిళలు ఎంతగానో ఇష్టపడే పసిడి ధరలు శుక్రవారం వరకు తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు నిన్న వరలక్ష్మీ వ్రతం కావడంతో మహిళలు పసిడి కొనుగోలు చేయడానికి జ్యులరీ షాపులకు క్యూ కట్టారు.

దేశంలో ఇప్పుడు ఎక్కడ జ్యులరీ షాపులు చూసినా కిటకిటలాడుతున్నాయి. ఆషాఢమాసం ముగిసి శ్రావణ మాసం మొదలైంది. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే పండగలు, పెళ్లిళ్లు ఎక్కడ చూసినా సందడే సందడి. ఈ సమయంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. గత కొంత కాలంగా బంగారం ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే.మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం నేడు శనివారం (ఆగస్టు 17) మళ్లీ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, పలు దేశాల్లో జరుగుతున్న యుద్దాల ప్రభావం బంగారంపై పడటంతో ధరల్లో మార్పులు జరుగుతున్నాయి. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

మహిళలు షాకింగ్ న్యూస్.. నిన్నటి వరకు భారీగా తగ్గిన పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ప్రపంచంలో ఎంతో విలువైన లోహం పసిడి దీని గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందుకే ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారు. ఎన్ని లోహాలు ఉన్నా.. ఆభరణాలుగా మార్చుకొని ధరించేది ఒక్క పసిడి మాత్రమే. అందుకే దీనికి ప్రతిరోజూ డిమాండ్ పెరిగిపోతూ వస్తుంది. భారత దేశంలో ఏ పండగ వచ్చినా.. శుభకార్యాలు జరిగినా వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి బంగారం కొనుగోలు చేస్తుంటారు. గత నెల కేంద్రంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ తర్వాత బంగారం ధరలు అమాంతం రూ.7 వేల వరకు దిగి వచ్చినా.. మళ్లీ పుంజుకుంటున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.10 పెరిగి,65,660 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.10 పెరిగి,71,630కు చేరింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,660 గా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,630 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర రూ.65,810 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర రూ.71,780 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర రూ.65,660 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర రూ.71,630 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.65,660 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.71,630 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.89,100 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.84,500, బెంగుళూరు లో రూ.84,100 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.89,100 వద్ద కొనసాగుతుంది.

Show comments