‘వరలక్ష్మీ వ్రతం’ పండగ వేళ భారీగా దిగివచ్చిన పసిడి.. ఈ రోజు ధర ఎంతంటే?

Gold and Silver Rates: ఇటీవల పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తగ్గినట్టే తగ్గి ఒక్కసారే షాక్ ఇచ్చాయి. వరలక్ష్మీ వ్రతం పండుగ సంధర్భంగా మహిళలకు అదిపోయే శుభవార్త

Gold and Silver Rates: ఇటీవల పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తగ్గినట్టే తగ్గి ఒక్కసారే షాక్ ఇచ్చాయి. వరలక్ష్మీ వ్రతం పండుగ సంధర్భంగా మహిళలకు అదిపోయే శుభవార్త

శ్రావణ మాసం ప్రారంభం నుంచి పసిడి కొనుగోలు ఎక్కువైంది. దానికి తగ్గట్టు ధరల్లో భారీ మార్పులు జరుగుతున్నాయి. కేంద్రంలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఇతర దేశాల నుంచి పసిడి దిగుమతుల సుంకం తగ్గించడంతో ధరలు అమాంతం దిగి వచ్చాయి. ఒక్క వారాంలోనే దాదాపు రూ.7 వరకు తగ్గడంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు.కొనుగోలు శాతం బాగా పెరిగిపోవడంతో మళ్లీ ధరలు పుంజుకున్నాయి. పసిడి ప్రియులకు శుభవార్త.. శ్రావణ మాసం రెండవ శుక్రవారం ఆగస్టు 16 (వరలక్ష్మీ వ్రతం) సందర్భంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్రపంచంలో పసిడి అంటే ఇష్టపడని వారు ఉండరు. భారత దేశంలో మహిళలకు ఏ పండుగ వచ్చినా.. ఎలాంటి శుభకార్యాలు అయినా కాస్తో కూస్తో పసిడి కొనుగోలు చేయడం అలవాటు. ఇక శ్రావణ మాసం వేళ పండగుల, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు మొదలయ్యాయి. నేడు మహిళలు తమ సౌభాగ్యం కోసం ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే ‘వరలక్ష్మీ వ్రతం’. దక్షిణ భారత దేశంలో ఈ పండగ ఎక్కువగా జరుపుకుంటారు. మొన్నటి వరకు పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. వరలక్ష్మీ వ్రతం పండుగ సందర్భంగా పసిడి ధరలు దిగి వచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి, 65,540 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి,71,500కు చేరింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65,540 గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.65,690 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.71,650 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.71,500 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.71,500 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.88,600 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.83,600, బెంగుళూరు లో రూ.79,900 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.88,600 వద్ద కొనసాగుతుంది.

గమనిక: పసిడి, వెండి ధరలు తరుచూ మారుతుంటాయి.. కస్టమర్లు తీసుకునే ముందు మరోసారి అప్పటి రేట్లను పరిశీలించి తెలుసుకోవాలని సూచన.

Show comments