Golda and Silver Rates: తగ్గినట్టే తగ్గి షాక్ ఇస్తున్న పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

తగ్గినట్టే తగ్గి షాక్ ఇస్తున్న పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Golda and Silver Rates: ప్రస్తుతం శ్రావణ మాసం.. దేశంలో పండుగలు, శుభకార్యాల సీజన్ మొదలైంది. దీంతో పసిడి కొనుగోలు బాగా పెరిగిపోయింది.

Golda and Silver Rates: ప్రస్తుతం శ్రావణ మాసం.. దేశంలో పండుగలు, శుభకార్యాల సీజన్ మొదలైంది. దీంతో పసిడి కొనుగోలు బాగా పెరిగిపోయింది.

ఇటీవల పసిడి ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో..ఎప్పడు తగ్గుతున్నాయో అర్థం కాని పరిస్థితి. గత నెల పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.. బంగారం దిగుమతులపై సుంకం తగ్గించడంతో మరుసటి పసిడి ధరలు దారుణంగా దిగివచ్చాయి. అలా వారం రోజుల పాటు తగ్గినట్టే తగ్గి మళ్లీ పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడే కీలక మార్పులు పసిడి, వెండి ధరలపై పడుతుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. నిన్న పసిడి ధరలు కాస్త తగ్గాయి.. నేడు మళ్లీ షాక్ ఇస్తూ భారీగా పెరిగిపోయాయి. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలో పసిడి ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పసిడి భారతీయుల నిత్యజీవితంలో భాగస్వామ్యం అయ్యింది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు బంగారం, వెండి ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే అంటారు. గత కొంత కాలంగా పసడి ధరలు పై పైకి ఎగబాకుతున్నాయి. ప్రతి ఏడాది కనీసం 5 వేలకు పైగా పెరిగిపోతుంది. ఇటీవల బడ్జెట్ సమావేశాల తర్వాత కాస్త తగ్గినా మళ్లీ పెరిగిపోతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 64,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 70,310కి చేరింది.

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 64,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 70,460కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 64,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 70,310కి చేరింది.  22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 64,450ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.  70,310కి చేరింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.  88,100, ఢిల్లీలో కిిలో వెండి ధర రూ. 83,100 వద్ద కొనసాగుతుంది.

Show comments