రెండు రోజుల మురిపమే.. రికార్డు స్థాయికి బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Rates: దేశంలో ఇప్పుడు పండగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ సమయాల్లో మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పసిడి ధరలే మళ్లీ భగ్గుమంటున్నాయి.

Gold and Silver Rates: దేశంలో ఇప్పుడు పండగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ సమయాల్లో మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పసిడి ధరలే మళ్లీ భగ్గుమంటున్నాయి.

దేశంలో పసిడి అంటే ఇష్టపడని వారు ఉండరు. మహిళలు, పురుషులు కూడా రక రకాల డిజైన్లతో చేసిన బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడుతుంటారు. ఇటీవల పసిడి కేవలం ఆభరణాలుగా మాత్రమే కాదు భవిష్యత్‌లో ఏ అవసరాలకైనా ఉపయోగపడుతుందని, మంచి ఇన్వెస్ట్ మెంట్ గా భావించి కొంటున్నారు. ఎందుకంటే పసిడి ప్రతి సంవత్సరం వేల రూపాయల్లో పెరిగిపోతూ వస్తుంది. రానున్న కాలంలో తులం లక్షదాటే పరిస్థితి ఉందని నిపుణులు అంటున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరల్లో తరుచూ మార్పులు సంభవిస్తున్నాయి. గత పదిరోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి రెండు రోజుల నుంచి చుక్కలు చూపిస్తుంది. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే.

భారత దేశంలో బంగారం అంటే ఎంతో విలువైన వస్తువుగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ ఒంటిపై కాస్తో.. కూస్తో బంగారం ఉండాలని కోరుకుంటారు.ఎంత బంగారం ఉంటే సొసైటీలో అంత గౌరవంగా చూస్తుంటారు. ఇక పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఎంతో కొంత పసిడి కొనుగోలు చేస్తుంటారు మహిళలు. అందుకే దేశంలో బంగారం ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూ వస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే 5 వేల రూపాలకు పెరిగిపోయింది. గత పది సంవత్సరాల్లో తులం బంగారం 75వేల మర్క్ కి చేరుకుంది. భవిష్యత్ కాలంలో పసిడి లక్ష రూపాలు దాటిపోతుందని అంటున్నానరు. రెండు రోజులుగా పసిడి, వెండి ధరలు పై పైకి పెరిగిపోతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.10 పెరిగి, రూ.68,760 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి, రూ.75,010 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.75,010 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,910ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.75,160 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.75,500 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.75,010 వద్ద కొనసాగుతుంది. దేశంలో కిలో వెండి పై రూ.100 పెరిగింది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.1,00,600, ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో కిలో వెండి ధర రూ.96,100గా,బెంగుళూరులో రూ. 94,850 వద్ద కొనసాగుతుంది.

Show comments