Gold Rate: పసిడి ప్రియులకు ఊరట.. దిగి వచ్చిన బంగారం ధర

Gold & Silver Rate On July 24th 2024: బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. బంగారం ధర మీద కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించిన ఎఫెక్ట్‌ బులియన్‌ మార్కెట్‌ మీద కనిపించింది. మరి నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..

Gold & Silver Rate On July 24th 2024: బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. బంగారం ధర మీద కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించిన ఎఫెక్ట్‌ బులియన్‌ మార్కెట్‌ మీద కనిపించింది. మరి నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..

కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం నాడు బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. దీని ఎఫెక్ట్‌.. దేశీయ స్టాక్‌, బులియన్‌ మార్కెట్స్‌ మీద గట్టిగానే పడింది. మరీ ముఖ్యంగా బడ్జెట్‌లో దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి కీలక ప్రకటనలు చేసింది. పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ.. కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి భారీగా కోతలు విధించింది. దాంతో బంగారం, వెండి లాంటి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్రం భారీగా తగ్గిస్తూ బడ్జెట్‌లో ప్రకటన చేసింది. దీనిపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఒక్కసారిగా 15-6 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయంతో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ దేశీయంగా భారీగా తగ్గడం విశేషం. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూడండి.

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు దిగి వచ్చాయి. మంగళవారం నాడు బడ్జెట్‌ సందర్భంగా గోల్డ్‌ రేటు ఒక్కసారిగా భారీగా పడిపోగా.. బుధవారం నాడు అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం పసిడి ధర దిగి వచ్చింది. ఇక నేడు రాజధాని భాగ్యనగరంలో పుత్తడి ధర దిగి వచ్చింది. పది గ్రాముల మీద రూ.10 తగ్గింది. దాంతో నేడు భాగ్యనగరంలో ఆభరణాల తయారీకి వినియోగించే పసిడి పది గ్రాముల రేటు రూ. 64,940గా ఉంది. అలానే నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా దిగి వచ్చింది. అది కూడా 10 గ్రాముల మీద పది రూపాయలు తగ్గింది. దాంతో నేడు నగరంలో 24 క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర రూ.70,850గా నమోదైంది.

ఇక హైదరాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్‌ రేటు దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాముల మీద రూ.10 తగ్గి.. 65,090గా ఉంది. అలానే 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్‌ రేటు పది గ్రాముల మీద పది రూపాయలు తగ్గి.. రూ. 71,000గా ఉంది.

బంగారం బాటలోనే వెండి..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు దిగి రాగా.. వెండి కూడా అదే దారిలో పయనించింది. కేజీ మీద 100 రూపాయల తగ్గింది. ఇవాళ హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ. 92,400 పలుకుతోంది. అలానే ఢిల్లీలో కూడా సిల్వర్‌ రేటు కేజీ మీద వంద రూపాయలు తగ్గి 87,900కి చేరింది.

Show comments