Gold Rate: వరుసగా తగ్గి నేడు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే

Gold & Silver Rate On July 17th 2024: బంగారం ధరలు సామాన్యులను ఊరిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు తగ్గి.. ఆ వెంటనే భారీగా పెరుగుతూ షాకిస్తున్నాయి. నేడు గోల్డ్‌ రేటు ఎంత పెరిగిందంటే..

Gold & Silver Rate On July 17th 2024: బంగారం ధరలు సామాన్యులను ఊరిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు తగ్గి.. ఆ వెంటనే భారీగా పెరుగుతూ షాకిస్తున్నాయి. నేడు గోల్డ్‌ రేటు ఎంత పెరిగిందంటే..

భారతీయులకు బంగారం అంటే.. ఖరీదైన లోహం మాత్రమే కాదు.. జీవితంలో ఓ భాగం. తిండి, బట్ట ఎలా తప్పనిసరి అని భావిస్తామో.. మన దేశంలో చాలా మంది.. ఒంటి మీద కాస్తో కూస్తో బంగారం ఉండాలని అంతే కచ్చితంగా భావిస్తారు. బంగారం కొనుగోలు దుబారా ఖర్చు కూడా కాదు. ఓ పదేళ్ల నుంచి చూసుకుంటే.. గోల్డ్‌ రేట్లు పెరగడమే కానీ దిగి రావడం లేదు. ఇప్పుడైతే ఏకంగా పది గ్రాముల పసిడి రేటు 75 వేల రూపాయలకు గరిష్టాలకు చేరింది. గత కొన్ని రోజులుగా మన దగ్గర పండగలు, వివాహాది శుభకార్యాలు లేవు.. కనుక పసిడి కొనుగోళ్లు మందగించాయి.

ఎందుకంటే.. మన దేశంలో పెళ్లిళ్లు, పండగలు, ఇతర శుభకార్యాల సమయంలో బంగారానికి డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎంతో కొంత గోల్డ్‌ కొనాలని భావిస్తారు. దాంతో ధరలు కూడా పైకి చేరుతుంటాయి. ఇదిలా ఉంటే.. మన దగ్గర గత మూడు రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం రేట్లు ఇవాళ మళ్లీ పెరిగాయి. అయితే వెండి రేటు దిగి రావడం మాత్రం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. మరి నేడు మన దగ్గర వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయి.. ఎంత పెరిగాయో ఓసారి చూడండి..

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో క్రితం సెషన్లలో వరుసగా దిగి వచ్చిన బంగారం ధర నేడు మాత్రం భారీగా పెరిగి.. సామాన్యులకు షాక్‌ ఇచ్చింది. ఇవాళ భాగ్యనగరంలో ఆభరణాల తయారీకి వినియోగించే గ 22 క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాముల మీద రూ. 350 మేర పెరిగి రూ. 67,850 వద్దకు చేరింది. అలానే 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల మీద రూ. 380 పెరిగి రూ. 74,020 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ మార్కెట్‌లో కూడా నేడు గోల్డ్‌ రేటు భారీగానే పెరిగింది. ఇవాళ హస్తినలో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల మీద రూ.350 పెరిగి రూ. 68 వేలకు చేరింది. అలానే 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల మీద రూ.380 పెరిగి రూ.74,170 కు చేరింది

రూ.200 తగ్గిన వెండి ధర..

పసిడి ధరలు పెరుగుతున్నా వెండి రేటు మాత్రం కాస్త ఊరట కల్పించింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ వెండి ధర కిలో మీద 200 రూపాయలు తగ్గి.. రూ. 99,500 వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో చూస్తే కిలో వెండి రేటు రూ.200 తగ్గి రూ. 95 వేలు పలుకుతోంది. పైన పేర్కొన్న గోల్డ్, సిల్వర్ ధరల్లో పన్నులు కలపలేదు. ట్యాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే.. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ఆ విషయం గమనించాలి.

Show comments