Gold Rate: పసిడి ప్రియులకు గోల్డెన్‌ ఛాన్స్‌.. లేట్‌ చేస్తే.. భారీ లాస్‌

Today Gold, Silver Rate: బంగారం కొనాలనుకునేవారు ఏమాత్రం ఆలస్యం చేసినా.. భారీగా నష్టపోతారు. గత కొన్ని రోజులుగా దిగి వస్తోన్న పుత్తడి ధర పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. కనుక త్వరపడండి

Today Gold, Silver Rate: బంగారం కొనాలనుకునేవారు ఏమాత్రం ఆలస్యం చేసినా.. భారీగా నష్టపోతారు. గత కొన్ని రోజులుగా దిగి వస్తోన్న పుత్తడి ధర పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. కనుక త్వరపడండి

బంగారం కొనాలనుకుంటున్నారా.. ధర తగ్గుతుంది.. మరి కొన్ని రోజులు ఎదురు చూద్దాం అని భావిస్తున్నారా.. అయితే మీరు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. ప్రస్తుతం దిగి వస్తోన్న గోల్డ్‌ రేటు.. భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇక క్రితం రెండు సెషన్లలో కలిపి బంగారం పది గ్రాముల మీద  ఏకంగా 1300 రూపాయలు దిగి వచ్చింది. ఇదే పంథా కొనసాగుతుందా అంటే చెప్పలేం.. కనుక భారీగా దిగి వచ్చిన సందర్భంలోనే కొనుగోలు చేయడం మంచిది అంటున్నారు. ఇప్పటికే శ్రావణం, పెళ్లిళ్ల జోరు కనిపిస్తోంది. క్రితం నెలతో పోలిస్తే.. ఈ మంత్‌లో పసిడి కొనుగోళ్లు జోరందుకున్నాయి. మరి రెండు రోజులుగా దిగి వస్తోన్న గోల్డ్‌ రేటు నేడు ఎంత ఉంది.. ఆ వివరాలు..

క్రితం సెషన్‌లలో భారీగా దిగి వచ్చిన బంగారం ధర.. నేడు స్థిరంగా ఉంది. ఇక ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు స్థిరంగా ఉంది. అంటే క్రితం సెషన్‌ రేటే ఈరోజు కూడా ఉంది. ఇక ఇవాళ భాగ్యనగరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల రేటు రూ.63,500 వద్ద ట్రేడింగ్ అవుతోంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన పసిడి రేటు స్థిరంగా ఉంది. ఇవాళ భాగ్యనగరంలో 24 క్యారెట్‌ గోల్డ్‌ రేటులో ఎలాంటి మార్పు లేకుండా పది గ్రాముల ధర రూ. 69,270 వద్ద కొనసాగుతోంది.

ఇక దేశరాజధాని ఢిల్లీలో కూడా నేడు గోల్డ్‌ రేటు స్థిరంగా ఉంది. ఇవాళ హస్తినలో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల రేటు రూ. 63,650 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం పది గ్రాముల ధర రూ. 69,420 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక ఢిల్లీ, హైదరాబాద్‌లో బంగారం, వెండి రేట్లలో స్వల్ప తేడాలుంటాయి. అందుకు కారణం స్థానికంగా ఉండే పన్నులే.

మరో రూ.500 తగ్గిన వెండి..

ఇక నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి రేటు మాత్రం ఇవాళ కూడా దిగి వచ్చింది. క్రితం సెషన్‌లో సిల్వర్‌ ధర కిలో మీద 500 రూపాయలు తగ్గగా.. నేడు మరో రూ.500 తగ్గింది. దాంతో ఈ  మూడు రోజుల్లోనే మొత్తంగా వెండి ధర కిలో మీద రూ. 4500 దిగి వచ్చినట్లయింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 86,500 వద్ద కొనసాగుతుంది. ఇక ఢిల్లీలో కూడా వెండి రేటు దిగి వచ్చింది. నేడు హస్తినలో సిల్వర్‌ రేటు కిలో మీద 500 రూపాయలు దిగి వచ్చి..  రూ. 81,500 వద్ద అమ్ముడవుతోంది.

Show comments