Gold Rate: పసిడి ప్రియలకు స్వల్ప ఊరట.. నేటి బంగారం ధరలు ఇవే

Gold, Silver Rate: బంగారం ధరలు నేడు పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తున్నాయి. గోల్డ్ కొనాలని భావించే వారు ఇప్పుడే త్వరపడితే మంచిది అంటున్నారు. ఆ వివరాలు..

Gold, Silver Rate: బంగారం ధరలు నేడు పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తున్నాయి. గోల్డ్ కొనాలని భావించే వారు ఇప్పుడే త్వరపడితే మంచిది అంటున్నారు. ఆ వివరాలు..

శ్రావణ మాసం ముగింపుకు వచ్చింది. శుభకార్యాలు కూడా ముగుస్తాయి. దాంతో బంగారం కొనుగోళ్లు మందగిస్తాయి. ఇక బడ్జెట్ ముందు వరకు మందకొడిగా ఉన్న పసిడి కొనుగోళ్లు.. ఆ తర్వాత ఊపందుకున్నాయి. ఖరీదైన లోహాల మీద పన్ను తగ్గించడంతో.. పుత్తడి కొనుగోళ్లు జోరందకున్నాయి. బడ్జెట్ తర్వాత బంగారం ధర ఒకేసారి 7 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. పైగా ఈ నెలలో శుభకార్యాలు ఉండటంతో.. పసిడి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. అయితే బంగారం ధర ఇదే స్థాయిలో దిగి వస్తుందని భావించిన వారికి నిరాశే ఎదురయ్యింది. ఆ తర్వాత భారీగా పెరిగింది. ఇక క్రితం సెషన్ లో స్వల్పంగా దిగి వచ్చిన గోల్డ్ రేటు.. నేడు కూడా ఊరట కలిగించింది. ఆ వివరాలు..

క్రితం సెషన్ లో స్వల్పంగా దిగి వచ్చిన బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. ఇక ఇవాళ  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ బంగారం రేటు పది గ్రాముల ధర స్థిరంగా రూ. 66,950 వద్ద కొనసాగుతుంది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ రేటు 10 గ్రాముల ధర కూడా స్థిరంగానే ఉంది. అంటే రూ. 73,040 వద్ద ట్రేడవుతోంది.

ఇవాళ హైదరాబాద్ లో బంగారం రేటు స్థిరంగా ఉండగా.. ఢిల్లీలో కూడా అలానే ఉంది.  నేడు హస్తినలో 22 క్యారెట్ పసిడి 10 గ్రాముల రేటు రూ. 67,100 వద్ద స్థిరంగా ఉంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం పది గ్రాముల ధర కూడా రూ. 73,190 వద్ద అమ్ముడవుతోంది.

దిగి వచ్చిన వెండి రేటు..

నేడు దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం రేట్లు స్థిరంగా ఉండగా.. వెండి రేటు మాత్రం పడిపోయింది.  ఇవాళ ఢిల్లీ మార్కెట్లో వెండి రేటు కిలో మీద రూ. 100 పడిపోయింది. దాంతో నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 87,900 వద్ద ఉంది. అలానే హైదరాబాద్ లో కూడా వెండి రేటు కిలో మీద రూ. 100 పడిపోయి రూ. 92,900 వద్ద ఉంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి.  స్థానికంగా ఉండే పన్నులే ఇందుకు కారణం.
Show comments