Gold Rate: పసిడి ప్రియులకు ఊరట.. దిగి వచ్చిన బంగారం ధర..

Today Gold, Silver Rate: బంగారం కొనాలనుకునే వారికి నేటి ధరలు భారీ ఊరట కలిగిస్తున్నాయి. మరి ఇవాళ గోల్డ్‌ రేటు ఎంత దిగి వచ్చిందంటే..

Today Gold, Silver Rate: బంగారం కొనాలనుకునే వారికి నేటి ధరలు భారీ ఊరట కలిగిస్తున్నాయి. మరి ఇవాళ గోల్డ్‌ రేటు ఎంత దిగి వచ్చిందంటే..

అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే.. దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగి వస్తూ ఉన్నాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి మన దేశంలో గోల్డ్‌ రేట్లు కొన్ని రోజుల పాటు భారీగా దిగి రాగా.. మరి కొన్ని రోజులు పెరుగుతూ వస్తోంది. దాంతో పసిడి రేట్లలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌కు ముందు గోల్డ్‌ రేటు ఆల్‌ టైమ్‌ గరిష్టాలకు చేరింది. పది గ్రాముల రేటు 75 వేల రూపాయలకు చేరింది. ఇక గత కొన్ని రోజులుగా పుత్తడి రేటు పెరగ్గా.. నేడు మాత్రం దిగి వచ్చింది. మరి సోమవారం నాడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర ఎంత ఉంది.. పది గ్రాముల మీద ఎంత దిగి వచ్చింది అంటే..

బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతుంది. ఇక ఆదివారంతో పోల్చితే నేడు అనగా సోమవారం నాడు.. దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం పది గ్రాముల రేటు రూ. 100 తగ్గింది. ఇక నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ బంగారు ఆభరణాల తయారీకి వినియోగించే గోల్డ్‌ రేటు పది గ్రాముల మీద 100 రూపాయల మేర దిగి వచ్చింది. దాంతో నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల రేటు రూ. 66,940 వద్ద అమ్ముడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా తగ్గింది. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల మీద 100 రూపాయలు దిగి వచ్చి.. రూ. 73,300 వద్ద అమ్ముడవుతోంది.

హైదరాబాద్‌తో పాడు దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా బంగారం రేటు దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ పసిడి పది గ్రాముల రేటు 100 రూపాయలు తగ్గి.. రూ. 67,900 దిగి వచ్చింది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన పుత్తడి రేటు 10 గ్రాముల మీద రూ.100 తగ్గి.. రూ. 73,180 వద్ద కొనసాగుతోంది.

వెండి రేటు ఇలా..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర దిగి రాగా.. వెండి కూడా అదే బాటలోనే పయనించింది. అంటే సిల్వర్‌ రేటు తగ్గింది. దాంతో నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో సిల్వర్‌ రేటు కేజీ మీద 100 రూపాయలు తగ్గింది. దాంతో నేడు భాగ్యనగరంలో కిలో వెండి రేటు రూ. 92,900 వద్ద కొనసాగుతోంది. అలానే హస్తినలో కూడా సిల్వర్‌ రేటు దిగి వచ్చింది. కిలో వెండిపై రూ. 100 తగ్గి.. రూ. 87,900 కు దిగి వచ్చింది.

Show comments