Gold, Silver Rate On Aug 19th 2024: పండగ పూట పసిడి ప్రియులకు భారీ ఊరట.. నేటి ధరలు ఇవే

Gold Rate: పండగ పూట పసిడి ప్రియులకు భారీ ఊరట.. నేటి ధరలు ఇవే

Today Gold, Silver Rate: పండగ పూట పసిడి ప్రియులకు భారీ ఊరట కలిగించే వార్త అని చెప్పవచ్చు. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Today Gold, Silver Rate: పండగ పూట పసిడి ప్రియులకు భారీ ఊరట కలిగించే వార్త అని చెప్పవచ్చు. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గత కొన్ని రోజులుగా దిగి వచ్చిన బంగారం ధరలు.. క్రితం సెషన్‌లలో భారీగా పెరిగి ఒక్కసారిగా షాక్‌ ఇచ్చాయి. దాంతో గోల్డ్‌ కొందామనుకునే వారు డైలమాలో పడ్డారు. ధర దిగి వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. పైగా ఇవాళ రక్షా బంధన్‌ పండుగ. కుదిరితే.. సోదరికి బంగారం కానుకగా ఇద్దామని ఆలోచించే వారు కూడా ఉంటారు. అదుగో అలాంటి వారికి నేటి పసిడి ధరలు ఊరట కలిగిస్తున్నాయి. క్రితం సెషన్‌లలో భారీగా పెరిగిన బంగారం రేటు.. నేడు మాత్రం ఊరట కలిగిస్తోంది. మరి ఇవాళ దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..

రక్షాబంధన్‌ నాడు బంగారం, వెండి రేట్లు ఊరట కలిగిస్తున్నాయి. క్రితం సెషన్‌లో ఒక్క రోజే గోల్డ్‌ రేటు పది గ్రాముల మీద ఏకంగా రూ.1050 మేర పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ మాత్రం పసిడి రేటు ఊరట కలిగించింది. స్థిరంగా కొనసాగుతోంది. ఇక నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారు ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ పసిడి పది గ్రాముల ధర స్థిరంగా ఉంది. అంటే ఇవాళ భాగ్యనగరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల రేటు రూ. 66,700 వద్ద కొనసాగుతోంది. క్రితం సెషన్‌లో ఇది ఏకంగా 1050 రూపాయలు పెరిగింది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు కూడా స్థిరంగానే ఉంది. ఇవాళ భాగ్యనగరంలో 24 క్యారెట్‌ ప్యూర్‌ గోల్డ్‌ పది గ్రాముల రేటు 72,770 రూపాయల వద్ద స్థిరంగా అమ్ముడవుతోంది.

ఇక దేశరాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధర స్థిరంగా ఉంది. ఇవాళ హస్తినలో22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల రేటు రూ.66,850 వద్దే స్థిరంగా ఉంది. క్రితం సెషన్‌లో ఇది భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల రేటు రూ. 72,920 కొనసాగుతోంది.

బంగారం బాటలోనే వెండి..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుండగా.. సిల్వర్‌ కూడా అదే బాటలో పయనించింది. ఇకపోతే క్రితం సెషన్‌లో అనగా ఆదివారం నాడు వెండి ధర కిలో మీద రూ.2000 పెరిగింది. ఇక నేడు హైదరాబాద్‌లో వెండి ధర స్థిరంగా అనగా.. రూ. 91 వేల వద్ద కొనసాగుతోంది. అలానే ఢిల్లీ మార్కెట్లో సిల్వర్‌ రేటు పెరగలేదు, దిగి రాలేదు. ఇవాళ హస్తినలో కిలో వెండి రేటు 86 వేల రూపాయల వద్ద కొనసాగుతోంది.  బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానికంగా విధించే పన్నులే ఇందుకు కారణం.

Show comments