Gold Rate: రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర.. గోల్డ్‌ కొనాలంటేనే షాక్‌ కొట్టే పరిస్థితి

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ షాక్‌ తగిలింది. నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు రికార్డు స్తాయిలో పెరిగాయి. ఆ వివరాలు..

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ షాక్‌ తగిలింది. నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు రికార్డు స్తాయిలో పెరిగాయి. ఆ వివరాలు..

బంగారం కొనాలనుకునే వారికి భారీ షాక్‌ తగిలింది. రెండు రోజుల క్రితం వరకు కాస్త స్థిరంగా ఉన్న పసిడి రేటు నేడు మళ్లీ ఒక్కసారిగా పరుగందుకుంది. గత కొన్ని రోజులుగా గోల్డ్‌ రేటును పరిశీలిస్తే.. దిగి వస్తుంది అనిపించింది. ఇది మరింత తగ్గుతుందని చాలా మంది భావించారు. కానీ అలా జరగకపోగా.. మళ్లీ పరుగులు పెడుతోంది. అందుకు కారణం అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్లను తగ్గిస్తుంద్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే అనగా.. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. మళ్లీ డాలర్‌కు డిమాండ్ తగ్గి.. అదే సమయంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. తాజాగా బులియన్‌ మార్కెట్‌లో ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగాయి. మరి నేడు హైదరాబాద్‌, ఢిల్లీలో గోల్డ్‌ రేటు ఎంత పెరిగింది.. తులం ధర ఎంత ఉంది అంటే..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. క్రితం సెషన్లలో దిగి రావడం, స్వల్పంగా పెరిగిన గోల్డ్‌ రేటు నేడు మాత్రం రికార్డు స్థాయిలో పెరిగింది. పది గ్రాముల మీద ఏకంగా 720 రూపాయలు పెరిగింది. ఇక ఇవాళ హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారు ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్ రేటు పది గ్రాముల మీద ఏకంగా రూ. 750 పెరిగి.. రూ. 67,150 కు చేరింది. అంతకుముందు సెషన్‌లో అనగా శుక్రవారం నాడు గోల్డ్‌ రేటు రూ. 200 మాత్రమే ఎగబాకింది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల మీద రూ. 810 పెరిగింది. దాంతో నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్‌ 10 గ్రాముల ధర రూ. 73,250కి చేరింది. క్రితం సెషన్‌లో ఇది రూ. 220 పెరిగింది.

అలానే దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు అనగా శనివారం నాడు పసిడి ధర భారీ స్థాయిలో పెరిగింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల మీద 750 రూపాయలు పెరిగి.. రూ.67,300కు చేరింది. అలానే 24 క్యారెట్‌ ప్యూర్‌ గోల్డ్‌ రేటు పది గ్రాముల మీద రూ. 810 పెరిగి.. 73,400 రూపాయలకు చేరింది.

భారీగా పెరిగిన వెండి రేటు..

నేడే దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరగ్గా.. వెండి రేటు కూడా అదే స్థాయిలో దూసుకుపోయింది. ఇవాళ దేశీయ బులియన్‌ మార్కెట్‌లో వెండి ధర కిలో మీద ఏకంగా 1500 రూపాయలు పెరిగింది. నేడు ఢిల్లీలో సిల్వర్‌ రేటు కేజీ మీద 1500 రూపాయలు పెరిగి.. రూ. 94 వేలకు చేరింది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా వెండి రేటు భారీగానే పెరిగింది. నేడు భాగ్యనగరంలో కేజీ వెండి ధర ఏకంగా రూ. 1500 పెరిగి.. 98,500 రూపాయలు పెరిగింది. క్రితం సెషన్ల వరకు కాస్త స్థిరంగా.. తక్కువ మొత్తంలోనే పెరిగిన రేటు.. ఇవాళ ఒక్క రోజే ఇంత భారీ స్థాయిలో పెరగడం సంచలనంగా మారింది.

Show comments