Gold Rate: పసిడి ప్రియులకు నిరాశ.. మరోసారి భారీగా పెరిగిన గోల్డ్‌ రేటు

Gold & Silver Rate Increased On July 13th: పసిడి ప్రియులకు నేడు అనగా శనివారం నాడు భారీ నిరాశ ఎదురు కానుంది. క్రితం సెషన్‌లో భారీగా పెరిగిన గోల్డ్‌ రేటు.. నేడు కూడా పైకి ఎగబాకింది. ఆ వివరాలు..

Gold & Silver Rate Increased On July 13th: పసిడి ప్రియులకు నేడు అనగా శనివారం నాడు భారీ నిరాశ ఎదురు కానుంది. క్రితం సెషన్‌లో భారీగా పెరిగిన గోల్డ్‌ రేటు.. నేడు కూడా పైకి ఎగబాకింది. ఆ వివరాలు..

మరి కొన్ని రోజుల్లో మన దగ్గర పండగలు, వివాహాది శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. మరోవైపు పసిడి ధర చూస్తేనేమో.. తగ్గేదేలే అంటూ పైపైకి దూసుకుపోతుంది. క్రితం సెషన్‌లో భారీగా పెరిగిన పసిడి రేటు నేడు కూడా అదే బాటలో పయనించి.. మరోసారి పెరిగింది. ఇక వెండి రేటు అయితే కిలో లక్ష రూపాయలకు చేరుకుని.. ఆ తర్వాత కొద్దిగా దిగి వచ్చింది. మన దగ్గర పుత్తడి ధరలు ఇలా పెరగడానికి ప్రధాన కారణం.. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు. దీని ఆధారంగా అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఆధారపడి ఉంటాయి. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఎంత పెరిగాయి అంటే..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఇవాళ అనగా శనివారం నాడు హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల మీద రూ. 300 పెరిగింది. దాంతో నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ పసిడి పది గ్రాముల ధర రూ. 67,600 వద్దకు చేరుకుంది. ఇక క్రితం సెషన్‌లో ఇది రూ. 200 మేర పెరిగింది. అలానే హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్‌ మేలిమి బంగారం పది గ్రాముల రేటు 330 రూపాయలు పెరిగింది. దాంతో ఇవాళ హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్‌ గోల్డ్‌ ధర రూ. 73,750 వద్దకు చేరింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం రేట్లు పైకి ఎగబాకాయి. ఇవాళ హస్తినలో 22 క్యారెట్స్ పసిడి ధర పది గ్రాముల మీద రూ. 300 పెరిగి.. రూ. 67,750కు చేరింది. అలానే స్వచ్ఛమైన 24 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల మీద రూ. 330 ఎగబాకి.. రూ. 73,900కు చేరింది.

స్థిరంగా వెండి ధరలు..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరగ్గా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 95,500 వద్ద స్థిరంగా ఉంది. అలానే హైదరాబాద్‌లో చూస్తే కేజీ సిల్వర్‌ రేటు లక్ష రూపాయల వద్ద కొనసాగుతోంది.

Show comments