Gold Rate: పసిడి ప్రియులకు భారీ ఊరట.. ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర

Gold & Silver Rate On July 19th 2024: గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన బంగారం ధర.. ఈ రోజు కాస్త శాంతించింది. మరి నేడు గోల్డ్‌ రేటు ఎంత ఉంది అంటే..

Gold & Silver Rate On July 19th 2024: గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన బంగారం ధర.. ఈ రోజు కాస్త శాంతించింది. మరి నేడు గోల్డ్‌ రేటు ఎంత ఉంది అంటే..

బంగారం కొనాలనుకునే వారు తీవ్ర అయోమయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అసలు ఏ రోజు తగ్గుతుందో.. ఏ రోజు గోల్డ్‌ రేటు దిగి వస్తుందో అర్థం కాని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక గత కొన్ని రోజులుగా గోల్డ్‌ రేటు దూసుకుపోయి.. ఈ ఏడాది గరిష్టాలకు చేరుకుంది. పది గ్రాముల ధర ఏకంగా 75 వేల రూపాయలకు చేరగా.. వెండి ధర అయితే లక్ష దాటి సంచలనం సృష్టించింది.  ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు ఉండటంతో.. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్‌ రేట్లు పెరుగుతున్నాయి. డాలర్‌కి డిమాండ్ తగ్గిపోయి.. బంగారానికి డిమాండ్‌ పెరగడంతోనే ఈ పరిస్థితి అంటున్నారు. ఇక గత కొన్ని రోజులుగా పెరుగుతున్న గోల్డ్‌ రేటు ఇవాళ మాత్రం  పెద్ద మొత్తంలో తగ్గాయి. ఈ ప్రభావం దేశీయ బులియన్‌ మార్కెట్‌ మీద కూడా పడింది. మరి నేడు దేశీయ రాజధాని, హైదరాబాద్‌లో బంగారం ధర ఎంత తగ్గింది.. ఏ రేటు వద్ద అమ్ముడవుతోందో చూద్దాం.

దేశీయ బులియన్‌ మార్కెట్‌లో క్రితం సెషన్‌లలో పెరిగిన బంగారం ధర నేడు మాత్రం భారీగా దిగి వచ్చింది. మన దగ్గర పసిడి రేటు ఇవాళ ఎంత ఉంది అంటే.. నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 22 క్యారెట్స్ పసిడి పది గ్రాముల రేటు రూ. 150 తగ్గింది. దాంతో నేడు భాగ్యగనరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల రేటు రూ. 68,600 మార్కుకు చేరింది.

అంతకుముందు రెండు సెషన్లలో 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల రేటు ఏకంగా ఇది రూ. 900, రూ. 350 చొప్పున 1250 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. నేడు మాత్రం 150 తగ్గి కాస్త ఊరట కలిగింది. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర పది గ్రాముల మీద రూ. 160 దిగివచ్చి.. 74,840 రూపాయల వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్‌ గోల్డ్‌ రేటు కూడా క్రితం 2 రోజుల్లోనే రూ. 980, రూ. 380 మేర పెరిగిన సంగతి తెలిసిందే.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగి వచ్చాయి. నేడు హస్తినలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 150 పడిపోయి 10 గ్రాములకు రూ. 68,750 వద్దకు దిగి వచ్చింది. ఇంకా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాముల మీద రూ. 160 తగ్గి ప్రస్తుతం రూ. 74,990 వద్ద ఉంది.

బంగారం బాటలోనే వెండి రేటు..

బంగారం ధరలతో పోలిస్తే వెండి రేట్లు భారీగా దిగొచ్చాయి. ఢిల్లీలో ఒక్కరోజే సిల్వర్‌ రేటు కేజీ మీద రూ. 1300 తగ్గింది. దాంతో నేడు హస్తినలో వెండి ధర కిలో రేటు రూ. 94,700 కు దిగొచ్చింది. అంతకుముందు రోజు రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ నగరంలో కూడా వెండి ధర కేజీ మీద రూ. 1300 పడిపోయి ప్రస్తుతం రూ. 99,200 కు చేరింది.

Show comments