ఇదే మంచి ఛాన్స్.. మళ్లీ తగ్గిన పసిడి ధర.. ఈ రోజు ఎంతంటే?

Today Gold and Silver Rates in Hyderabad: భారత దేశంలో పండుగలు, శుభకార్యాలకు మహిళలకు తమ స్థోమతకు తగ్గట్టు బంగారం, వెండి కొనుగోలు చేస్తుంటారు. గత వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో జ్యులరీ షాపులు కిటకిటలాడుతున్నాయి.

Today Gold and Silver Rates in Hyderabad: భారత దేశంలో పండుగలు, శుభకార్యాలకు మహిళలకు తమ స్థోమతకు తగ్గట్టు బంగారం, వెండి కొనుగోలు చేస్తుంటారు. గత వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో జ్యులరీ షాపులు కిటకిటలాడుతున్నాయి.

ప్రపంచంలో ఎంతో విలువై లోహం బంగారం. అందుకే బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. బంగారం కేవలం ఆభరణాలుగా మాత్రమే కాదు..భవిష్యత్ లో ఏ అవసరానికైనా వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇటీవల పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మేలిమి బంగారం తులం రూ.73 వేలు దాటేసింది. రాబోయే రోజుల్లో లక్షకు చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మార్కెట్ లో తక్కువ ధర ఉన్నపుడు కొంటే మంచిదని సూచిస్తున్నారు. నేడు మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

గత నెల శ్రావణ మాసం ప్రారంభం అయ్యింది. అంతకు ముందు మూఢాలు ఉండటంతో ఎలాంటి శుభకార్యాలు జరగలేదు. ఇక శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సందడి మొదలైంది. దీంతో బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఇటీవల అంతర్జాతయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్దాల ప్రభావం పసిడి, వెండిపై పడుతుంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,66,680 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,72,750 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,750 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,830 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,900 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,210 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,750 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 తగ్గింది.చెన్నై, కేరళా, తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.89,900 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.84,900, బెంగుళూరు‌లో రూ.82,800 వద్ద కొనసాగుతుంది.

Show comments