P Krishna
P Krishna
దేశంలో బంగారం ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. గత నెలలో వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి మళ్లీ ధరలు మళ్లీ పెరగడం మొదలు పెట్టాయి. గత 5 రోజులుగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.1300 వరకు పెరిగింది. దసరా, దీపావళి, బతుకమ్మ పండుగల సందర్భంగా బంగారు నగలు కొనుగోలు చేయాలనుకునే వారు ఇప్పటికే అలర్ట్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని తెలియడంతో జ్యూవెలరీ షాపులకు క్యూ కడుతున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా రోజు రోజుకీ షాక్ ఇస్తున్నాయి. గత నెలతో పోల్చుకుంటే ఒక్క వారంలోనే భారీగా పెరిగిపోయింది. నేటి బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..
మొన్నటి వరకు నేల చూపులు చూసిన పసిడి ఒక్కసారే చుక్కలు చూపిస్తుంది. బంగారం ధరలు ఈ స్థాయిలో పెరిగిపోవడానికి కారణం ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ యుద్దం కారణం అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. యుద్దం కారణంగా అనిశ్చితి ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ యుద్దం మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు రెండు శాతం కంటే ఎక్కువ పెరిగింది. ఇక బుధవారం దేశ వ్యాప్తంగా నమోదైన బంగారం ధరల వివరాలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.300 పెరిగింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.330 వరకు పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,650 చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,530 వద్ద ట్రెండ్ అవుతుంది.
దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.58,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.53,800 గా కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,800 చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58,690 వద్ద ట్రెండ్ అవుతుంది. ముంబై, బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,650 చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,530 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర రూ.75,500 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో 72,600 ట్రెండ్ అవుతుంది. బెంగుళూరులో మాత్రం కిలో వెండి రూ.70,500 కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.75,500 గా ట్రెండ్ అవుతుంది.