Gold Price: నిరాశ పరిచిన బంగారం ధర.. ఇలా అయితే కొనడం కష్టమే!

పసిడి పరుగు చూసి కొనాలనే ఆశ, కోరిక పూర్తిగా చచ్చిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మధ్యతరగతి జనాలు, సామాన్యులు అయితే బంగారమా వామ్మో వద్దులే అంటున్నారు. అంతలా రేట్లు దూసుకుపోతున్నాయి. మరి నేడు గోల్డ్‌ ధర ఎంత ఉందంటే..

పసిడి పరుగు చూసి కొనాలనే ఆశ, కోరిక పూర్తిగా చచ్చిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మధ్యతరగతి జనాలు, సామాన్యులు అయితే బంగారమా వామ్మో వద్దులే అంటున్నారు. అంతలా రేట్లు దూసుకుపోతున్నాయి. మరి నేడు గోల్డ్‌ ధర ఎంత ఉందంటే..

బంగారం ధర చూస్తే.. అసలు కొనలా వద్దా.. కొనగలమా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలకు తగ్గట్టుగా.. దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు పరుగులు తీస్తోంది. ఒక్క రోజు ధర దిగి వచ్చి.. హమ్మయ్యా అనుకునేలోపే.. భారీగా దూసుకుపోతుంది. ఇక కొన్ని సార్లు అయితే అత్యంత స్వల్పంగా పది గ్రాముల మీద కేవలం 10 రూపాయల చొప్పున దిగి వస్తూ.. చిరాకు కలిగిస్తోంది. కాకపోతే కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే.. జనాలు ఇప్పుడు కచ్చితంగా గోల్డ్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు లేవు. అంటే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌ కాకపోవడంతో.. బంగారం కొనుగోళ్లు మందగించాయి. ఇక ఆషాఢం ముగిసి.. శ్రావణ మాసం వచ్చిందంటే.. పండగలు, శుభముహుర్తాలు ఇలా వరుసగా కట్టకట్టుకు వస్తాయి. అప్పుడు పసిడికి డిమాండ్‌ భారీగా ఉంటుంది. ఆ సంగతి అలా ఉంచితే నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయి అంటే..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది. కేజీ గోల్డ్‌ మీద 100 రూపాయలు దిగి వచ్చింది. అంటే పది గ్రాములు మీద కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గింది అన్నమాట. ఇక నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర ఇలా ఉంది. బుధవారం నాడు భాగ్యనగరం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల ధర కేవలం 10 రూపాయలు తగ్గి.. రూ.66,190 గా ఉంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన పసిడి రేటు కూడా దిగి వచ్చింది. బుధవారం నాడు భాగ్యనగరంలో 24 క్యారెట్‌ మేలిమి బంగారం పది గ్రాముల మీద కేవలం 10 రూపాయలు తగ్గి.. 72,210 రూపాయల వద్ద కొనసాగుతుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి. హస్తినలో నేడు 22, 24 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల మీద కేవలం 10 రూపాయలు మాత్రమే దిగి వచ్చింది. దాంతో నేడు హస్తినలో ఈరోజు 22 క్యారెట్‌ బంగారం ధర గ్రాము ధర 6,634 గాను.. పది గ్రాముల ధర 66,340 రూపాయలుగా ఉంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం గ్రాము ధర 7,246 గా ఉండగా.. 10 గ్రాముల ధర 72, 460 రూపాయలుగా ఉంది.

స్వల్పంగా పెరిగిన వెండి ధర

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా దిగి రాగా.. వెండి రేటు మాత్రం అందుకు భిన్నంగా పెరిగింది. ఇవాళ హైదరాబాద్‌లో సిల్వర్‌ రేటు కిలో మీద 100 రూపాయలు పెరిగింది. దాంతో నేడు భాగ్యనగరంలో కేజీ వెండి ధర 96,100 రూపాయలుగా ఉంది. అలానే హస్తినలో కూడా సిల్వర్‌ రేటు కేజీ మీద 100 రూపాయలు పెరిగి.. 91,600 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్‌ రేటు ఎక్కువ.. సిల్వర్‌ రేటు తక్కువ ఉంటుంది. స్థానికంగా ఉన్న పన్నులే అందుకు కారణం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.

Show comments