nagidream
More Interest Than FDs: ఎవరైనా తమ దగ్గర ఉన్న డబ్బును పొదుపు చేయడం కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. అయితే మీరు ఈ పథకం గురించి తెలుసుకుంటే ఇక్కడే ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అని ఇందులోనే పెట్టుబడి పెడతారు. ఎందుకంటే దీనికి ప్రభుత్వ గ్యారంటీ ఉంది.
More Interest Than FDs: ఎవరైనా తమ దగ్గర ఉన్న డబ్బును పొదుపు చేయడం కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. అయితే మీరు ఈ పథకం గురించి తెలుసుకుంటే ఇక్కడే ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అని ఇందులోనే పెట్టుబడి పెడతారు. ఎందుకంటే దీనికి ప్రభుత్వ గ్యారంటీ ఉంది.
nagidream
ఎవరైనా గానీ ఎక్కువ వడ్డీ వచ్చే పెట్టుబడి మార్గాలని ఎంచుకుంటారు. ఈ క్రమంలో తమ డబ్బుకి రక్షణ కూడా ఉండేలా చూసుకుంటారు. డబ్బు సేఫ్ గా ఉండాలంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లే మార్గం అని వాటిని ఆశ్రయిస్తుంటారు. అయితే మీకు ఈ విషయం తెలిస్తే.. ఎఫ్డీల కంటే కూడా ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తారు. పైగా దీనికి ప్రభుత్వ గ్యారంటీ కూడా ఉంది. ఆ పథకం పేరు ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. ఆర్బీఐ రెపో రేట్లను పెంచడంతో ఈ సేవింగ్స్ బాండ్స్ వడ్డీ రేట్లు మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ఈ సేవింగ్స్ బాండ్లపై అధిక వడ్డీ రావడమే కాకుండా ఆర్బీఐ గ్యారంటీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారి డబ్బుకు భద్రత ఉంటుంది.
ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్స్ లో వడ్డీ రేటు నేషనల్ సేవింగ్స్ స్కీంతో ముడిపడి ఉండడం వల్ల దీన్ని వడ్డీ రేట్లు మారుతుంటాయి. నేషనల్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేట్లు పెంచితే.. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ లో వడ్డీ రేట్లు పెరుగుతాయి. అలానే వడ్డీ రేటు తగ్గితే ఇక్కడ కూడా వడ్డీ రేటు తగ్గుతుంది. ప్రస్తుతం అయితే వడ్డీ రేట్లు పెరిగాయి. నేషనల్ సేవింగ్స్ బాండ్స్ అందించే వడ్డీ రేటు కంటే 0.35 శాతం వడ్డీ రేటు ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ లో లభిస్తుంది. 2024 జూలై-డిసెంబర్ అర్ధ సంవత్సరానికి ఆర్బీఐ తాజాగా వడ్డీ రేట్లను ఖరారు చేసింది.
నేషనల్ సేవింగ్స్ స్కీంపై 7.7 శాతం వడ్డీ రేటు వస్తుండగా.. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్స్ పై 8.05 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేలు ప్రతి ఆరు నెలలకొకసారి మారుతుంటాయి. అలానే ఏడాదిలో రెండుసార్లు అంటే జనవరి 1న, జూలై 1న వడ్డీ ఖాతాదారుల ఖాతాలో జమ అవుతుంది. ఇక ఈ బాండ్స్ లో పెట్టుబడి పెట్టాలంటే ఆర్బీఐ ఆథరైజేషన్ కలిగిన ఏదైనా బ్యాంకులో ఈ బాండ్స్ ని కొనచ్చు. బ్యాంక్ వెబ్ సైట్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఆర్బీఐకి చెందిన రిటైల్ డైరెక్ట్ పోర్టల్ నుంచి కూడా కొనుక్కోవచ్చు. దీని కోసం కేవైసీ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
గమనిక: మీ డబ్బుకి ఆర్బీఐ గ్యారంటీ ఉంటుంది కానీ వడ్డీ రేటు అనేది స్థిరంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు అనేవి మారుతుంటాయని గుర్తించుకోవాలి.