nagidream
మీరు కరెంట్ బిల్లు, రెంట్, ఫోన్ రీఛార్జ్ లు క్రెడిట్ కార్డుల ద్వారా పే చేస్తున్నారా? మీవి మాత్రమే కాకుండా మీ బంధువుల బిల్లులు కూడా చెల్లిస్తున్నారా? మీరు ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? అయితే మీరు అదనపు ఛార్జీలు చెల్లించక తప్పదు. ఎందుకంటే?
మీరు కరెంట్ బిల్లు, రెంట్, ఫోన్ రీఛార్జ్ లు క్రెడిట్ కార్డుల ద్వారా పే చేస్తున్నారా? మీవి మాత్రమే కాకుండా మీ బంధువుల బిల్లులు కూడా చెల్లిస్తున్నారా? మీరు ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? అయితే మీరు అదనపు ఛార్జీలు చెల్లించక తప్పదు. ఎందుకంటే?
nagidream
ఇప్పుడంతా ఆన్ లైన్ లోనే పేమెంట్స్ చేస్తున్నారు. రెంటు, కరెంటు, ఫోన్ రీఛార్జ్, గ్యాస్ ఇలా ఏదైనా గానీ ఆన్ లైన్ లో పేమెంట్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళు అయితే క్రెడిట్ కార్డ్స్ నుంచి పేమెంట్ చేస్తున్నారు. ఇలా క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లించిన కస్టమర్లకు ఆయా బ్యాంకులు రివార్డులు ఇచ్చేవి. ఇప్పటికీ కొన్ని ఇస్తున్నాయి. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు సీన్ మారింది. అంతకు ముందు క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లించేవారు. ఆలా చెల్లించినవారికి క్యాష్ బ్యాక్ కూడా వచ్చేది. అయితే బ్యాంకులు ఇంటి అద్దె మీద ఛార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇతర బిల్ పేమెంట్స్ కి కూడా ఛార్జీలు వసూలు చేసేందుకు కొన్ని బ్యాంకులు సిద్ధమయ్యాయి.
మీ దగ్గర ఈ బ్యాంకు క్రెడిట్ కార్డులు ఉంటే కనుక.. ఆ కార్డుల ద్వారా బిల్ పేమెంట్స్ చేస్తే కనుక మే 1 నుంచి మీరు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంకు.. ఈ రెండు బ్యాంకులు 2024 మే 1 నుంచి క్రెడిట్ కార్డులతో యుటిలిటీ బిల్ పేమెంట్ చేసే కస్టమర్లకు 1 శాతం అదనపు ఛార్జీ విధించనుంది. అంటే ఐడీఎఫ్సీ, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 1000 విద్యుత్ బిల్లు చెల్లిస్తే.. అదనంగా 10 రూపాయలు ఛార్జీ పడుతుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. ఫోన్ రీఛార్జ్ లు, నెట్ బిల్లు, రెంటు, కరెంటు బిల్లు వంటి యుటిలిటీ బిలులు అన్నీ కలిపి 15 వేల రూపాయల లోపు ఉంటే ఎస్ బ్యాంకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించదు. అదే 15 వేల రూపాయలు దాటితే మాత్రం ప్రతీ బిల్ చెల్లింపుల మీద 1 శాతం అదనపు ఛార్జీ అనేది వసూలు చేస్తుంది.
ఐడీఎఫ్సీ బ్యాంకు అయితే 20 వేల వరకూ పరిమితి విధించింది. 20 వేల లోపు క్రెడిట్ కార్డు ద్వారా ఎన్ని యుటిలిటీ బిల్లులైనా చేసుకోవచ్చు. ఆపైన ఉంటే మాత్రం 1 శాతం ఫీజు చెల్లించాలి. సడన్ గా అదనపు ఛార్జీ వసూలు చేయాలని అనుకోవడానికి ఒక కారణం ఉంది. కొంతమంది వ్యాపార అవసరాల కోసం క్రెడిట్ కార్డులను మిస్ యూజ్ చేస్తున్నట్టు తెలిసింది. మామూలుగా క్రెడిట్ లిమిట్ తో పోలిస్తే యుటిలిటీ బిల్లుల అమౌంట్ మొత్తం తక్కువగానే ఉంటుంది. అయితే కొంతమంది వ్యాపారులు దీన్ని ఆసరాగా తీసుకుని వ్యాపార లావాదేవీలను కూడా యుటిలిటీ బిల్లుల కింద చేర్చి బెనిఫిట్ పొందుతున్నారు. దీని వల్ల క్రెడిట్ కార్డులు జారీ చేసిన బ్యాంకులు నష్టపోతున్నాయి. అందుకే దీన్ని నివారించడం కోసం బ్యాంకులు నిర్దేశించిన లిమిట్ దాటితే అదనపు ఛార్జీ విధించాలని నిర్ణయించుకున్నాయి.
మరో కారణం కూడా ఉంది. క్రెడిట్ కార్డు లావాదేవీలపై వ్యాపారస్తుల నుంచి పేమెంట్ గేట్ వేలు వసూలు చేసే ఛార్జీలను మర్చంట్ డిస్కౌంట్ రేట్ అని అంటారు. నిత్యావసరాలు, ట్రావెల్ ఇలా ఆయా కేటగిరీని బట్టి ఈ డిస్కౌంట్ రేట్ అనేది మారుతుంది. యుటిలిటీ బిల్లు చెల్లింపులపై ఈ డిస్కౌంట్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీని వల్ల బ్యాంకులకు ఆదాయం తక్కువ వస్తుంది. అయితే ఇక్కడ కూడా వ్యాపారస్తులు మిగతా లావాదేవీలను కూడా యుటిలిటీ బిల్స్ కింద చూపించి బ్యాంకులకు నష్టం చేకూరుస్తున్నారని బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి ఎస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్ కలిగిన సాధారణ కస్టమర్లు ఈ విషయంలో జాగ్రత్త పడితే మంచిది. చాలా మంది తమ ఇంటికి సంబంధించినవే కాకుండా బంధువులకు చెందిన యుటిలిటీ బిల్స్ కూడా చెల్లిస్తుంటారు. 15 వేలు, 20 వేలు దాటితే కనుక ఏ బ్యాంకులు బిల్లుల మీద 1 శాతం ఫీజు వసూలు చేస్తాయి. దీని వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ కథనాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ లో షేర్ చేసి వారికి అవగాహన కల్పించండి.