Vinay Kola
Children: పిల్లల భవిష్యత్తు కోసం తల్లి దండ్రులు కష్టపడుతుంటారు. మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటారు.
Children: పిల్లల భవిష్యత్తు కోసం తల్లి దండ్రులు కష్టపడుతుంటారు. మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటారు.
Vinay Kola
పిల్లల భవిష్యత్తు కోసం తల్లి దండ్రులు ఎంతో కష్టపడుతుంటారు. పిలలు మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. ముఖ్యంగా పిల్లల చదువు కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఆ ఖర్చుల కోసం ఎలా పొదుపు చేయాలో ఆలోచిస్తుంటారు. అయితే ప్రస్తుతం అనేక రకాల పొదుపు మార్గాలు ఉన్నాయి. వాటిలో ప్రతి నెలా కొంత పెట్టుబడి పెడుతూ ఉంటే పిల్లల భవిష్యత్తుకు కచ్చితంగా ఉపయోగపడతాయి. వారి కోసం పొదుపు చేయడానికి ముందు మంచి మార్గాల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం పిల్లల చదువు ఖర్చులకు ఉపయోగపడే వివిధ రకాల పథకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పిల్లల అవసరాల కోసం చైల్డ్-ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి పిల్లల చదువు కోసం డబ్బులను పొదుపు చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే వీటి గురించి మార్కెట్ నిపుణులని అడిగి పూర్తి వివరాలు తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచిది. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల (ఎన్ఎస్సీ)లో కూడా డబ్బులను పొదుపు చేయడం వల్ల కూడా మంచి లాభాలని సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఐదేళ్ల కాల వ్యవధికి స్థిరమైన రాబడి వస్తుంది. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని 80సీ కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. అలాగే పిల్లల కోసం డబ్బు పొదుపు చేయడానికి పీపీఎఫ్ కూడా మంచి ఆప్షన్.పెట్టుబడిదారులకు ఇది సురక్షితమైన పథకం. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు.
ఇక బాలికల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో మంచి లాభాలను పొందవచ్చు. ఇందులో నెలకు కనీసం వెయ్యి రూపాయలు పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకం బాలికకు 21 ఏళ్లు వచ్చే దాకా లాక్-ఇన్ పీరియడ్‌తో ఎక్కువ పన్ను-రహిత రాబడిని అందిస్తుంది. అలాగే ఇందులో ఆదాయపు పన్ను మినహాయింపు కూాడా ఉంది. ఇంకా మ్యూచువల్ ఫండ్స్‌లోని ఎస్ఐపీలు కూడా పెట్టుబడికి మంచివి. వీటిలో ప్రతినెలా ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి లాభాలు పొందవచ్చు. ఇందులో మీరు నెలకు రూ.500 కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక పిల్లలకు ఉపయోగపడే ఈ పథకాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.