Vinay Kola
Best cars under 6 lakhs: ట్రాఫిక్ సమస్యని ఎదుర్కోవాలంటే ఆటోమ్యాటిక్ కార్లనేవి మంచి ఆప్షన్లగా చెప్పవచ్చు. వీటితో అంత ఇబ్బందులు ఉండవు. డ్రైవర్ చాలా రిలాక్స్ గా ముందుకు వెళ్లొచ్చు. ఆటొమ్యాటిక్ కార్లు కొంచెం ధర ఎక్కువగా ఉంటాయి. 6 లక్షల లోపు దొరికే మంచి ఆటొమ్యాటిక్ కార్ల గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Best cars under 6 lakhs: ట్రాఫిక్ సమస్యని ఎదుర్కోవాలంటే ఆటోమ్యాటిక్ కార్లనేవి మంచి ఆప్షన్లగా చెప్పవచ్చు. వీటితో అంత ఇబ్బందులు ఉండవు. డ్రైవర్ చాలా రిలాక్స్ గా ముందుకు వెళ్లొచ్చు. ఆటొమ్యాటిక్ కార్లు కొంచెం ధర ఎక్కువగా ఉంటాయి. 6 లక్షల లోపు దొరికే మంచి ఆటొమ్యాటిక్ కార్ల గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Vinay Kola
కార్లలో మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమ్యాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా మనం మాన్యువల్ కార్లతో కొన్ని సమస్యలు ఎదుర్కుంటూ ఉంటాము. ముఖ్యంగా సిటీలల్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు సమస్యలు వస్తాయి. అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మ్యానువల్ కార్లు కాసేపు ఆగాకా మళ్ళీ స్టార్ట్ కావాలంటే కొంత సమయం పడుతుంది. అలాంటప్పుడు స్టార్టింగ్ ట్రబుల్స్ ఇబ్బంది పెడతాయి. అందుకే ట్రాఫిక్ సమస్యని ఎదుర్కోవాలంటే ఆటోమ్యాటిక్ కార్లనేవి మంచి ఆప్షన్లగా చెప్పవచ్చు. ఎందుకంటే వీటితో అంత ఇబ్బందులు ఉండవు. డ్రైవర్ చాలా రిలాక్స్ గా ముందుకు వెళ్లొచ్చు. కానీ ఆటొమ్యాటిక్ ఆప్షన్ కలిగిన కార్లు కొంచెం ధర ఎక్కువగా ఉంటాయి. అయితే 6 లక్షల లోపు దొరికే మంచి ఆటొమ్యాటిక్ కార్ల గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మారుతి ఎస్ ప్రెస్సో: 6 లక్షల్లోపు ఆటొమ్యాటిక్ ఆప్షన్ కలిగిన మంచి కార్ కావాలంటే మారుతి ఎస్ ప్రెస్సోని ట్రై చేయవచ్చు. సిటీ ట్రాఫిక్ లలో ఈ కార్ తో ఇబ్బంది లేకుండా వెళ్ళవచ్చు. ఈ కార్ ఎక్స్ షో రూమ్ ధర 4 లక్షల 26 వేల నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ కార్ ఆటొమ్యాటిక్ వేరియంట్ మాత్రం 5 లక్షల 60 వేల ఎక్స్ షో రూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కార్ టాప్ వేరియంట్ 6 లక్షల 12 వేల ఎక్స్ షో రూమ్ ధర వరకు ఉంటుంది. ఇది లీటరుకు 24.44 నుంచి 32.73 కిలో మీటర్ల దాకా మైలేజీని ఇస్తుంది. ఇది 998 సీసీ ఇంజిన్ తో వస్తుంది. దీనిలో 4 నుంచి 5 మంది దాకా ప్రయాణించవచ్చు. కానీ లాంగ్ డ్రైవ్ కి మాత్రం ఈ కార్ 4 మందికి సౌకర్యంగా ఉంటుంది. ఇది పెట్రోల్ మరియు సీఎన్జీ ఆప్షన్లలో వస్తుంది.
రెనాల్ట్ క్విడ్: రెనాల్ట్ క్విడ్ కూడా 6 లక్షల్లో దొరికే చవకైన కార్. దీన్ని మధ్య తరగతి ప్రజలు ఎంతో ఇష్టంగా కొంటారు. ఈ కార్ ఆటొమ్యాటిక్ వేరియంట్ 5 లక్షల 45 వేల ఎక్స్ షో రూమ్ ధర నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ 6 లక్షల 45 వేల ఎక్స్ షో రూమ్ ధర దాకా ఉంటుంది. 6 లక్షల్లో మంచి స్టైలిష్ ఆటొమ్యాటిక్ వేరియంట్ కార్ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. ఇది 999 సీసీ ఇంజిన్ తో వస్తుంది. ఇది లీటరుకు 21.7 కిలోమీటర్ల నుంచి 22 కిలోమీటర్ల దాకా మైలేజీని ఇస్తుంది. ఇది పెట్రోల్ వేరియంట్లో వస్తుంది. ఇందులో కూడా 4 నుంచి 5 మంది దాకా ప్రయాణించవచ్చు. ఈ కార్ చిన్నగా ఉండటం వలన ట్రాఫిక్ లో చాలా ఈజీగా నడవచ్చు. 6 లక్షల్లో ఆటొమ్యాటిక్ వేరియంట్ కార్ కావాలనుకునేవారికి ఇది కూడా మంచి ఎంపిక.
మారుతీ ఆల్టో కే10: దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. మార్కెట్లో ఎన్ని కార్లు వచ్చినా ఈ కార్ స్థాయి మాత్రం మారదు. ఎన్నో దశబ్దాల నుంచి ఈ కార్ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి అమ్మకాలతో దూసుకుపోతుంది. ఈ కార్ ఆటొమ్యాటిక్ వేరియంట్ 5 లక్షల 51 వేల ఎక్స్ షో రూమ్ ధర నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ 5 లక్షల 90 వేల ఎక్స్ షో రూమ్ ధర దాకా ఉంటుంది. ఈ కార్ లీటరుకు 24.39 నుంచి 33.85 కిలోమీటర్ల దాకా మైలేజీని ఇస్తుంది. ఇది 998 సీసీ ఇంజిన్ తో వస్తుంది. ఈ కార్ పెట్రోల్ మరియు సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కార్ లో కూడా 4 నుంచి 5 మంది దాకా ప్రయాణించవచ్చు. ఈ కార్ కూడా ట్రాఫిక్ జామ్లలో ఈజీగా వెళ్లగలిగే ఆటొమ్యాటిక్ కార్. మరి ఈ కార్ల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.