HYDలో మరో కొత్త సిటీ.. ఈ ప్రాంతాల చుట్టూ పెరగనున్న భూముల ధరలు!

Telangana Govt Decides To Build Industrial Cluster Between Outer Ring Road and Regional Ring Road: హైదరాబాద్ లో డబ్బులు సరిపోక పెట్టుబడి పెట్టలేదని బాధపడేవారికి సరైన అవకాశం దొరికింది. హైదరాబాద్ లో మరో కొత్త సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కొన్ని ప్రాంతాలను కలుపుతూ కొత్త సిటీని నిర్మించనుంది. ఇప్పుడు కనుక ఆ ప్రాంతాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందవచ్చు.

Telangana Govt Decides To Build Industrial Cluster Between Outer Ring Road and Regional Ring Road: హైదరాబాద్ లో డబ్బులు సరిపోక పెట్టుబడి పెట్టలేదని బాధపడేవారికి సరైన అవకాశం దొరికింది. హైదరాబాద్ లో మరో కొత్త సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కొన్ని ప్రాంతాలను కలుపుతూ కొత్త సిటీని నిర్మించనుంది. ఇప్పుడు కనుక ఆ ప్రాంతాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందవచ్చు.

భూముల ధరలు పెరగాలంటే రియల్ ఎస్టేట్ అభివృద్ధి అనేది ఉండాలి. అది జరగాలంటే ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, పలు కంపెనీలు, పరిశ్రమలు రావాలి. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలి. దీంతో పాటు కనెక్టివిటీ అనేది బాగుండాలి. ఇవన్నీ ఉంటే అక్కడ రియల్ ఎస్టేట్ అనేది జోరుగా సాగుతుంది. అప్పుడు భూముల ధరలు పెరుగుతాయి. హైదరాబాద్ లో ఐటీ, ఆటోమొబైల్, ఫార్మా ఇలా అనేక రంగాలకు సంబంధించిన కంపెనీలు, ఇండస్ట్రీలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అనేది భారీగా పెరిగిపోయింది. అయితే హైదరాబాద్ లానే మరొక చోట పారిశ్రామిక సిటీని డెవలప్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ల మధ్య పారిశ్రామిక సిటీని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.

పారిశ్రామిక సిటీ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీంతో ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది. రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ల సమీపంలో 25 వేల ఎకరాల్లో పారిశ్రామిక సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తుంది. ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుతో అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ సమీప ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో మరింత జోష్ పెంచుతుంది. ఇప్పటికే అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతుంది. ఇక అవుటర్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్ల కనెక్టివిటీతో మరింత అభివృద్ధి జరగనుంది. ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీ డెవలప్మెంట్ పనులు చేపట్టాయి. కాబట్టి అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ సమీపంలో స్థలాల మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

పారిశ్రామిక సిటీ పూర్తయితే అవుటర్, రీజనల్ రింగ్ రోడ్లకి సమీపంలో ఉన్న ఘట్కేసర్, శంషాబాద్, తుక్కుగూడ, కొల్లూరు, నార్సింగి, షాద్ నగర్, చేవెళ్ల, శంకరపల్లి, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్ పూర్, భువనగిరి, చౌటుప్పల్, కందుకూరు, అమంగల్ వంటి ఏరియాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఏరియాల్లో స్థలాల ధరలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పెట్టుబడి పెడితే కనుక భవిష్యత్తులో మంచి లాభాలను చూడవచ్చు. అభివృద్ధిని ఒకే చోట కాకుండా నగర శివారులకు కూడా విస్తరించాలని.. నగరం చుట్టూ విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. దీంతో హైదరాబాద్ సిటీలో పెట్టుబడి పెట్టలేని వారికి నగర శివారు ప్రాంతాలు ఆశాజనకంగా ఉంటాయి.

Show comments