Land Rates In Mucherla: మరో హైదరాబాద్‌గా ఆ ప్రాంతం.. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులవ్వడం పక్కా!

మరో హైదరాబాద్‌గా ఆ ప్రాంతం.. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులవ్వడం పక్కా!

Telangana Govt Announced Fourth City In Mucherla: ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పేర్లతో మూడు సిటీలు ఉన్నాయి. నాలుగో సిటీగా మరొక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ ఏరియాలో ప్రస్తుతం ల్యాండ్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు స్థలాల మీద పెట్టుబడి పెడితే కనుక భారీ లాభాలు పొందవచ్చు.  

Telangana Govt Announced Fourth City In Mucherla: ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పేర్లతో మూడు సిటీలు ఉన్నాయి. నాలుగో సిటీగా మరొక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ ఏరియాలో ప్రస్తుతం ల్యాండ్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు స్థలాల మీద పెట్టుబడి పెడితే కనుక భారీ లాభాలు పొందవచ్చు.  

ఒకప్పుడు తెలంగాణలో నగరం అంటే హైదరాబాద్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత సికింద్రాబాద్ వచ్చింది. 1806వ సంవత్సరంలో ఈ సికింద్రాబాద్ ఏర్పాటయ్యింది. 1990ల మధ్య కాలంలో సైబరాబాద్ ఏర్పాటయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో మూడు నగరాలుగా ఇవి ఉన్నాయి. ట్రై సిటీస్ గా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లని మించిన మరొక నగరాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోని ఆ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ముచ్చెర్లను ఇంటర్నేషనల్ హబ్ గా మారుస్తామని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మెడికల్ అండ్ హెల్త్ హబ్, అగ్రికల్చర్ హబ్ వంటివి ఏర్పాటు చేస్తామని అన్నారు. క్రీడలు, ఐటీ, పరిశ్రమలు, ఎనర్జీ వంటి వాటిపై కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. ఈ రంగాలన్నీ తెలంగాణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు.

యువతను డ్రగ్స్, మత్తు పదార్ధాలు వంటి వాటి నుంచి దూరం చేసేలా స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మిస్తామని అన్నారు. 200 ఎకరాల్లో గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు చేయనున్నారు. అలానే 200 ఎకరాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ని ఏర్పాటు చేయనున్నారు. వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ని ఏర్పాటు చేస్తామని అన్నారు. హైదరాబాద్ సిటీలోకి వచ్చేలా మెట్రో రైలుతో ముచ్చెర్ల ప్రాంతాన్ని అనుసంధానం చేస్తామని అన్నారు. అలానే ముచ్చెర్లలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించే ఆలోచన కూడా ఉందని అన్నారు. నాలుగు వేల ఎకరాల్లో ముచ్చెర్లను అంతర్జాతీయ ప్రమాణాలతో మహా నగరంగా తీర్చిదిద్దుతామని.. వైద్య సేవలతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు.

తెలంగాణలో మరో హైదరాబాద్ ని డెవలప్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతంలో పెట్టుబడి  పెడితే కనుక భారీ లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఏరియాలో చదరపు అడుగు స్థలం ధర యావరేజ్ గా రూ. 850గా ఉంది. ఇంతకంటే తక్కువ ధరకు మరెక్కడా దొరకదు.  మీకు రూ. 7,650కే వచ్చేస్తుంది. గజం రూ. 8 వేలు అనుకున్నా గానీ ఒక పాతిక లక్షలు పెట్టుబడి పెడితే 300 గజాల పైనే స్థలం వస్తుంది. ఇప్పుడు గజం 8 వేలు ఉంటే డెవలప్ అయ్యాక 50 వేలు, లక్షకు పెరిగిపోతుంది. ఇప్పుడు పెట్టిన 25 లక్షల పెట్టుబడి కోటిన్నర నుంచి 3 కోట్లు అవుతుంది. కాబట్టి తక్కువ పెట్టుబడితో భారీగా సంపాదించాలి అనుకునేవారికి ఇదే మంచి అవకాశం.   

గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.

Show comments