డ్యూయల్ గేర్ బాక్స్‌తో లాంచ్ కాబోతున్న టాటా నెక్సాన్ సీఎన్జీ

Tata Nexon CNG: టాటా మోటార్స్ నుంచి వచ్చిన నెక్సాన్ మోడల్స్ నుంచి సీఎన్జీ వెర్షన్ ని పరిచయం చేసింది. త్వరలోనే ఈ సీఎన్జీ వేరియంట్ ని లాంచ్ చేయనుంది. దీని ప్రత్యేకతల విషయానికొస్తే..

Tata Nexon CNG: టాటా మోటార్స్ నుంచి వచ్చిన నెక్సాన్ మోడల్స్ నుంచి సీఎన్జీ వెర్షన్ ని పరిచయం చేసింది. త్వరలోనే ఈ సీఎన్జీ వేరియంట్ ని లాంచ్ చేయనుంది. దీని ప్రత్యేకతల విషయానికొస్తే..

ఆగస్టు 7న టాటా మోటార్స్ కంపెనీ కర్వ్ ఈవీ కారు ధరను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వేరియంట్ వచ్చే నెల సెప్టెంబర్ 2న లాంచ్ కానుంది. అదనంగా టాటా మోటార్స్ కంపెనీ ఈ ఏడాదిలో మరొక కొత్త ఎస్యూవీ కారుని పరిచయం చేయనుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2024లో భాగంగా టాటా మోటార్స్ కంపెనీ ప్రొడక్షన్ కి దగ్గరలో ఉన్న టాటా కర్వ్, హారియర్ ఈవీ మోడల్స్ తో పాటు నెక్సాన్ ఐసీఎన్జీ కాన్సెప్ట్ ని ప్రదర్శించనుంది. హారియర్ ఈవీని 2025 ప్రారంభంలో లాంచ్ చేస్తున్నట్లు ఇప్పటికే టాటా మోటార్స్ కంపెనీ నిర్ధారించింది. ఇక నెక్సాన్ సీఎన్జీ కారుని త్వరలోనే మార్కెట్లో అడుగుపెట్టనుంది. టాటా దేశంలో ట్విన్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతో కూడిన అతి పెద్ద వాహనాలను కలిగి ఉంది.

ఈ టెక్నాలజీని హ్యుందాయ్ కంపెనీ తన ఎక్స్టర్ మైక్రో ఎస్యూవీలో వాడింది. ఎక్కువగా అమ్ముడవుతున్న టాటా కార్లలో పంచ్ కారు టాప్ లో ఉంది. ఇది సీఎన్జీ ఆప్షన్ తో వస్తుంది. దీనికి విరుద్ధంగా నెక్సాన్ టాప్ టెన్ జాబితాలో ఉన్నప్పటికీ విక్రయాల్లో మాత్రం క్షీణతను చవి చూసింది. ఇప్పుడు నెక్సాన్ లోనే ట్విన్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతో తర్వాతి మోడల్ ని తీసుకొస్తుంది. టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్యూవీ లైనప్ ని మరింత విస్తృతం చేస్తుంది. మరింత మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని కోరుకునేవారి కోసం మరింత ఫ్యూయల్ ఎఫిషియంట్ ఛాయిస్ తో సీఎన్జీ వేరియంట్స్ ని తీసుకొస్తుంది. పంచ్, ఆల్ట్రోజ్ ట్విన్ సిలిండర్ సీఎన్జీ మోడల్స్ లో అనుసరించిన వ్యూహాన్నే నెక్సాన్ సీఎన్జీ విషయంలోనూ అనుసరిస్తుంది.

కాన్సెప్ట్ లో చూపించిన దాని ప్రకారం.. నెక్సాన్ సీఎన్జీ బూట్ స్పేస్ 230 లీటర్లని తెలుస్తుంది. ఈ రెండు సిలిండర్లు ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటాయి. ఒక్కో సిలిండర్ 60 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ సీఎన్జీ సిస్టంలో మైక్రో స్విచ్, సిక్స్ పాయింట్ సిలిండర్ మౌంటింగ్ సెటప్, సింగిల్ ఈసీయూ యూనిట్, హై క్వాలిటీ మెటీరియల్స్ ఉంటాయి. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజన్ సాధారణంగా 120 పీఎస్ హార్స్ పవర్ ని, 170 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఇక దీని ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది. సాధారణ వేరియంట్ లతో పోలిస్తే ఈ సీఎన్జీ వేరియంట్ ధర రూ. 70 వేల నుంచి రూ. 80 వేలు అధికంగా ఉంటుందని అంచనా. 

Show comments