స్విగ్గీలో భారీ మోసం.. బయటపెట్టిన మహిళ

ఇటీవల కాలంలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ అయిన స్విగ్గీలో కస్టమర్లకు వరుసగా చెదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా మరోసారి స్విగ్గీ ఫుడ్ డెలవరీ చేసిన స్కామ్ గురించి ఓ మహిళ బయటపెట్టింది.

ఇటీవల కాలంలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ అయిన స్విగ్గీలో కస్టమర్లకు వరుసగా చెదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా మరోసారి స్విగ్గీ ఫుడ్ డెలవరీ చేసిన స్కామ్ గురించి ఓ మహిళ బయటపెట్టింది.

ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరూ బిజీ లైఫ్ ను గడుపుతున్నందువల్ల అందరికి వండుకొని తినే సమయం దొరకడం లేదు. అందువలన చాలమంది ఆన్ లైన్ ఫుడ్ కి ఎక్కువగా ఆలవాటు పడిపోయారు. ఈ క్రమంలోనే రకరకాల ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ యాప్స్ అనేవి అందుబాటులోకి వచ్చేశాయి. అయితే వీటిలో ఎక్కువగా అందరూ వినియోగించే బెస్ట్ ఫుడ్ డెలివరీ యాప్ ఏదీ అంటే అది స్విగ్గీ అనే చెప్పవచ్చు. కానీ, ఈ స్వగ్గీ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ విషయానికొస్తే.. ఇటీవల కాలంలో కస్టమర్లకు వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే నాణ్యత, పరిశుభ్రత లేని ఫుడ్ ని డెలవరీ చేయడం.. ఆర్డర్ చేసిన ఫుడ్ లో పురుగులు, బల్లులు వంటివి దర్శనం ఇస్తున్నా సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ అయిన స్విగ్గీలో ఓ యువతి ఫుడ్ ఆర్డర్ చేసింది. కానీ, స్విగ్గీ ఫుడ్ డెలివరీ చేసిన స్కామ్ కు ఆ మహిళ షాక్ కు గురైయ్యింది. ఆ వివారళ్లోకి వెళ్తే..

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అయిన స్విగ్గీ చేసిన మోసాన్ని ఓ యువతి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో తనకు రూ.150 వసూలు చేసి కూడా.. సకాలంలో ఆర్డర్ ను డెలివరీ చేయలేదని వాపోయింది. అలాగే ఆహార అవసరాల కోసం స్విగ్గీని నమ్మోద్దని సలహా ఇచ్చిది. స్విగ్గీ నుంచి స్వాతి ముకుంద్ అనే మహిళ కేక్ ఆర్డర్ చేసింది. అయితే ఆ మహిళ కేవలం 1.8 కిలోమీటర్ల దూరం డెలివరీ కోసం రూ.150 చెల్లించింది. అంత భారీ మొత్తం డెలివరీ ఫీజు చెల్లించిన కూడా.. సకాలంలో కేక్ అందకపోవడంతో స్విగ్గీ ఫుడ్ డెలివరీ సర్వీస్ పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా ఈ స్కామ్ గురించి ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్నారు. అందులో స్విగ్గీ ఇండియా నాట్ కూల్ ఎటాల్ అంటూ స్వాతి ముకుంద్ తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది. అలాగే నాతో పాటు నాకు తెలిసిన మరికొందరుకు ఇలానే జరిగింది. ఆహార అవసరాల కోసం స్విగ్గీని దయచేసి ఎప్పుడూ నమ్మవద్దని అందరికీ సలహా ఇచ్చింది.

అలాగే నిజాయితీగా చెప్పాలంటే.. నేను ఒక సాధారణ కస్టమర్ ని, సాధారణ వ్యక్తిని, కానీ వినియోగదారులకు సరైన సమయానికి ఆహారం, మంచి సేవను అందించడం ఇకపై మీ మెనూలో లేదని నేను అనుకుంటున్నాను అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో స్విగ్గీ ఆమెను సంప్రదించి భవిష్యత్తులో ఇలాంటివి మరెప్పుడూ జరగవని హామీ ఇచ్చింది.అందుకు సంబంధించిన విషయాలను స్వాతి ముకుంద్ తన కామెంట్స్ సెక్షన్స్ లో షేర్ చేసింది. స్విగ్గీ ఇకపై ఇది పునరావృతం కాదని నాకు హామి ఇచ్చిందని అని ఆమె చెప్పుకొచ్చారు. మరి, స్విగ్గీ పై ఆ మహిళ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments