P Venkatesh
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటి లోగా ఆ వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటి లోగా ఆ వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే.
P Venkatesh
ప్రముఖ దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఎస్బీఐ పై మండిపడింది. రేపటిలోగా వివరాలను ఇవ్వాలని ఎస్బీఐని అదేశించింది. ఈ నెల 15 లోగా సీఈసీ తమ వద్ద ఉన్న ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు వెబ్ సైట్ లో పొందుపర్చాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రేపటిలోగా పూర్తి వివరాలను అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను అందించడానికి గడువు కోరడంతో సుప్రీం కోర్టు తిరస్కరించింది. గడువు పొడిగింపు ప్రసక్తే లేదని చెబుతూ.. రేపటిలోగా బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని ఎస్‌బీఐకి స్పష్టం చేసింది.
ఎలక్ట్రోరల్ బాండ్ల పథకం ద్వారా రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందుతాయి. అయితే ఈ స్కీమ్ ను ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఎలక్ట్రోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్దమని.. బాండ్ల జారీని నిలిపేయాలంటూ ఎస్బీఐని ఆదేశించింది. అంతేగాక ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు అందిన నిధులు, దాతల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ నెల 6లోగా అందించాలని ఎస్బీఐని ఆదేశించింది.
ఎస్బీఐ అందించిన ఆ వివరాలను వెబ్ సైట్ ద్వారా వెల్లడించాలని సుప్రీం కోర్టు ఈసీని ఆదేశించింది. అయితే తక్కువ సమయంలో ఈసీకి ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను అందించడం కుదరదని జూన్ 30 వరకు గడువు పొడిగించాలంటూ సుప్రీం కోర్టులో ఎస్బీఐ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేసిన సుప్రీం కోర్టు ఎస్బీఐ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. గత 26 రోజులుగా ఏం చేస్తున్నారని సుప్రీం కోర్టు ఎస్బీఐని ప్రశ్నించింది.