nagidream
Do This To Avoid Increased Prices: జియో రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచేయడంతో మిగతా నెట్వర్క్ లు కూడా తమ టారిఫ్ ప్లాన్స్ ధరలను పెంచేశాయి. అయితే మీరు ఈ ధరల పెంపు భారం నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. దీని వల్ల మీరు చాలా లాభం పొందుతారు. అది కూడా ఏడాది పాటు. ఎలా అంటే?
Do This To Avoid Increased Prices: జియో రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచేయడంతో మిగతా నెట్వర్క్ లు కూడా తమ టారిఫ్ ప్లాన్స్ ధరలను పెంచేశాయి. అయితే మీరు ఈ ధరల పెంపు భారం నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. దీని వల్ల మీరు చాలా లాభం పొందుతారు. అది కూడా ఏడాది పాటు. ఎలా అంటే?
nagidream
జియో తన రీఛార్జ్ ధరలను అమాంతం పెంచేసింది. దీంతో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ లు కూడా రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. దీంతో యూజర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అయితే మీకు ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది. పెరిగిన రీఛార్జ్ ధరల భారం మీ మీద పడకూడదంటే కనుక మీరు వెంటనే ఈ పని చేయండి. జియో, ఎయిర్ టెల్ నెట్వర్క్ లు పెంచిన రీఛార్జ్ ప్లాన్స్ ని జూలై 3 నుంచి అమలు చేయనున్నాయి. ఇక వొడాఫోన్ ఐడియా జూన్ 4 నుంచి పెంచిన ధరలను అమలు చేయనుంది. అయితే ఈ నెట్వర్క్ సిమ్ లు వాడుతున్న వారు ఈ అధిక భారం నుంచి తప్పించుకోవచ్చు. ఎలా అంటే?
ఉదాహరణకు మీరు జియో సిమ్ వాడుతున్నట్లైతే కనుక మీరు ఉన్న ప్లాన్ ని కాకుండా ఏడాది ప్లాన్ తో జూలై 3వ తేదీ లోపు రీఛార్జ్ చేయించుకోండి. అప్పుడు మీకు ఇప్పుడున్న ధరకే ఏడాది మొత్తం వర్తిస్తుంది. మీ పాత ప్లాన్ 28 రోజులకు రూ. 239 అయితే మీరు 13 నెలలు రీఛార్జ్ చేయించాల్సి ఉంటుంది. అప్పుడు 13 నెలలకు రూ. 3,107 రూపాయలు అవుతుంది. అదే ఏడాది పాటు రీఛార్జ్ చేయిస్తే రూ. 2,999 అవుతుంది. దీంతో మీకు రూ. 108 ఆదా అవుతుంది. ఈ 239 రూపాయల ప్లాన్ లో రోజుకు 1.5 జీబీ డేటా మాత్రమే వస్తుంటే ఏడాది ప్లాన్ లో రోజుకు 2.5 జీబీ డేటా వస్తుంది. అది కూడా 365 రోజులు వస్తుంది. ఇప్పుడే ఏడాది ప్లాన్ తో రీఛార్జ్ చేయించుకుంటే రూ. 2,999తో వదిలిపోతుంది. జూలై 3 నుంచి ఈ ప్లాన్ ధర రూ. 3,599 అయిపోతుంది.
ఒకవేళ నెల ప్లాన్ వేయించుకోవాలి అని అనుకుంటే రూ. 239 రూపాయల ప్లాన్ జూలై 3 నుంచి రూ. 299 అవుతుంది. అప్పుడు 13 నెలలకు రూ. 3,887 అవుతుంది. ఇలా చూసినా గానీ మీకు నష్టమే. కాబట్టి జూలై 3వ తేదీ లోపు ఏడాది ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే కనుక ఎక్కువ డేటా వస్తుంది. పనిలో పనిగా 365 రోజులు వస్తుంది. డబ్బులు కూడా ఆదా అవుతాయి. నెల ప్లాన్ కంటే కూడా ఏడాది ప్లాన్ వేసుకుంటే గనుక మీరు ఈ ధరల పెంపు భారం నుంచి తప్పించుకోవచ్చు. వొడాఫోన్, ఎయిర్ టెల్ నెట్వర్క్ సిమ్ వాడేవారు కూడా ఇలా చేస్తే ప్రయోజనం పొందుతారు. ఒకవేళ మీ ప్లాన్ గడువు తేదీ ఇంకా అవ్వకపోతే గనుక లాభనష్టాలు భేరీజు వేసుకుని ఏడాది ప్లాన్ వేయించుకోండి.