Standup India Scehme: స్టాండప్ ఇండియా స్కీంతో మహిళలకు 10 లక్షల నుంచి కోటి వరకూ లోన్!

స్టాండప్ ఇండియా స్కీంతో మహిళలకు 10 లక్షల నుంచి కోటి వరకూ లోన్!

Standup India Scheme Offers 10 Lakhs To 1 Crore Loan For Women: లోన్ తీసుకుంటే వెంటనే లోన్ ఈఎంఐ అనేది స్టార్ట్ అయిపోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న ఈ పథకం ద్వారా లోన్ తీసుకుంటే 18 నెలలు అంటే ఏడాదిన్నర వరకూ ఒక్క పైసా కూడా లోన్ ఈఎంఐ చెల్లించే పని లేదు. ఆ తర్వాత నుంచి మాత్రమే చెల్లించే సదుపాయం ఉంటుంది.

Standup India Scheme Offers 10 Lakhs To 1 Crore Loan For Women: లోన్ తీసుకుంటే వెంటనే లోన్ ఈఎంఐ అనేది స్టార్ట్ అయిపోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న ఈ పథకం ద్వారా లోన్ తీసుకుంటే 18 నెలలు అంటే ఏడాదిన్నర వరకూ ఒక్క పైసా కూడా లోన్ ఈఎంఐ చెల్లించే పని లేదు. ఆ తర్వాత నుంచి మాత్రమే చెల్లించే సదుపాయం ఉంటుంది.

ఎక్కడైనా గానీ లోన్ తీసుకుంటే తీసుకున్న తర్వాత నెల ప్రారంభం అయ్యే నాటి నుంచి ఈఎంఐ అనేది ప్రారంభమైపోతుంది. కొత్తగా వ్యాపారం చేసుకునేవారికి ఇది పెద్ద సమస్య. ఎందుకంటే వ్యాపారం పెట్టిన వెంటనే లాభాలు రావు కదా. లాభాలు రావడానికి సమయం పడుతుంది. ఈ క్రమంలో ఈఎంఐ కట్టాలంటే సొంతంగా జేబులోంచి డబ్బులు తీయాల్సి ఉంది. అదే ఒక ఏడాది, ఏడాదిన్నర పాటు బ్యాంకు లోన్ కట్టే పని లేకుండా సదుపాయం కల్పిస్తే ఎంత బాగుంటుంది. ఈ గ్యాప్ లో వ్యాపారం కూడా ట్రాక్ పైకి వస్తుంది. లాభాల బాట పడుతుంది. అందుకే ఈ అవకాశాన్ని కల్పిస్తుంది కేంద్రం. వ్యాపారం చేయాలనుకునే మహిళలకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం స్టాండప్ ఇండియా అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని 2016లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలు వ్యాపారం చేసుకుని సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

మహిళలను ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా మహిళలు 10 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ రుణం పొందవచ్చు. ఈ పథకం ద్వారా సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు, అలానే ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ లోన్ అందజేస్తారు. తయారీ పరిశ్రమ, సేవలకు సంబంధించిన మహిళా వ్యాపారులకు, వ్యవసాయ అనుబంధ పనులు చేసేవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ లోన్ మంజూరు చేస్తుంది. లోన్ తీసుకున్న తర్వాత 18 నెలల వరకూ మారటోరియం పీరియడ్ లో భాగంగా లోన్ చెల్లించాల్సిన పని లేదు. ఏడాదిన్నర పాటు మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా వ్యాపారం మీద దృష్టి పెట్టవచ్చు. అయితే మహిళలు పెట్టాలనుకున్న వ్యాపారానికి అయ్యే పెట్టుబడి మొత్తంలో పది శాతం పెట్టాల్సి ఉంటుంది. అంటే కోటి రూపాయల లోన్ పెట్టాలనుకుంటే అందులో 10 లక్షలు మహిళలు పెట్టుకోవాలి. మిగతా డబ్బు కేంద్రం లోన్ ద్వారా ఇస్తుంది.

ఒకవేళ 10 లక్షలు లోన్ పెట్టుకుంటే.. అందులో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే మీకు ఆ పైన మిగిలిన పెట్టుబడి ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ లోన్ పొందాలంటే మహిళలు కనీసం 18 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. భర్త బిజినెస్ చేస్తున్నట్లైతే ఈ వ్యాపారంలో మహిళల వాటా 51 శాతం ఉంటే లోన్ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ మహిళల పేరు మీద వ్యాపారం ఉంటే లోన్ ఇస్తారు. ఈ లోన్ పొందాలంటే గతంలో ఏదైనా బ్యాంకులో గానీ, ఫైనాన్స్ సంస్థలో గానీ లోన్ తీసుకుని డిఫాల్టర్ గా మారకూడదు. అంటే లోన్ తీసుకుని చెల్లించలేకపోవడం చేయకూడదు. ఈ లోన్ తీసుకున్నాక 7 సంవత్సరాల్లో చెల్లించాలి. మగవారు కూడా ఈ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. అయితే తమ బిజినెస్ లో 51 శాతం వాటా ఆడవారి పేరు మీద ఉండాలి. ఈ లోన్ కి అప్లై చేసుకోవాలంటే స్థానిక బ్యాంకు అధికారులను సంప్రదించాలి. మరిన్ని వివరాలకు స్టాండప్ ఇండియా అధికారిక వెబ్ సైట్ ని విజిట్ చేయండి. 

Show comments