తగ్గేదేలే అంటున్న టమాటా.. కిలో రూ.300 దిశగా పరుగులు!

తగ్గేదేలే అంటున్న టమాటా.. కిలో రూ.300 దిశగా పరుగులు!

టమాటా ధర రాకెట్‌ వేగంతో దుసుకుపోతుంది. ఇప్పట్లో దిగి వచ్చే ఆలోచనే కనిపించడం లేదు. ఇక టమాటా రేటు పెరిగిన దగ్గర నుంచి సామాన్యులు దాన్ని కొనడమే మానేశారు. ఇప్పటికే టమాటా ధర డబుల్‌ సెంచరీ దాటేసిన సంగతి తెలిసిందే. బుధవారం మదనపల్లి మార్కెట్‌లో కిలో టమాటా ఏకంగా 224 రూపాయలు పలికింది. ఇక ఈమధ్య కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా.. టమాటా ధర ఇప్పట్లో తగ్గేదేలే అన్నట్లు ఉంది. ఇక అతి త్వరలోనే టమాటా ధర కిలో 300 రూపాయలకు చేరే అవకాశం ఉంది అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం మరోసారి టమాట ధరలు భగ్గుమన్నాయి. మదర్ డైరీ తన రిటైల్ స్టోర్స్‌లో కిలో టమాటాలను రూ.259కి విక్రయించారు.

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా.. టమాటా ధర పెరుగుతోంది. వరుసగా కురుస్తోన్న వర్షాల కారణంగా పంట పాడవ్వడమే కాక.. దిగుబడితో పాటు సరఫరా తగ్గిపోయింది. ఇక ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతి త్వరలోనే టమాటా ధర కిలో 300 రూపాయలు చేరుతుంది అన్నారు. టమాటా రేటు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు సబ్సిడీ ధరకే టమాటాను ప్రజలకు విక్రయిస్తున్నాయి. జూలై 14 నుంచి సబ్సిడీ రేట్లకే టమాటా విక్రియిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక పేటీఎంలో కిలో టమాటా 70 రూపాయలకే అని ఆఫర్‌ ప్రకటించడంతో.. వారంలో 10 వేల కిలోల టమాటాలు అమ్ముడయ్యాయి.

ఇక బుధవారం టమాటా రిటైల్‌ ధర కిలోకు 203 రూపాయలుగా ఉంది. అయితే, మదర్ డెయిరీ సఫాల్ రిటైల్ ఔట్‌లెట్స్‌లో కిలో టమాట ధర రూ. 259గా ఉంది. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం కిలో ధర రూ.200 వరకు పలుకుతోంది. కొన్ని చోట్ల మాత్రం రూ. 250 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. టమాట రకం, క్వాలిటీని బట్టి ధరల్లో మార్పు ఉంటోంది.

Show comments