Shravana Masam 2024-Buy Gold By Taking Gold Loan: శ్రావణ మాసంలో శుభవార్త! చేతిలో రూపాయి లేకున్నా బంగారం కొనొచ్చు!

Gold: శ్రావణ మాసంలో శుభవార్త! చేతిలో రూపాయి లేకున్నా బంగారం కొనొచ్చు!

Shravana Masam 2024-Buy Gold By Taking Gold Loan: బంగారం రేటు దిగి వస్తోంది.. కొందామంటే చేతిలో డబ్బుల్లేవు.. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే..

Shravana Masam 2024-Buy Gold By Taking Gold Loan: బంగారం రేటు దిగి వస్తోంది.. కొందామంటే చేతిలో డబ్బుల్లేవు.. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే..

బంగారం అంటే భారతీయులకు ఎంత ప్రీతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేతిలో కాస్త పెద్ద మొత్తం ఉంటే చాలు.. పసిడి కొనుగోలుకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇక పండగలు, వివాహాది శుభకార్యాల వేళ మన దేశంలో పుత్తడి కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అయితే గత కొన్నాళ్లుగా మన దేశంలో పసిడి ధర రాకెట్‌ కన్నా వేగంగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ ఏడాదికి గరిష్ట స్థాయికి చేరింది. పది గ్రాముల 24 క్యారెట్‌ గోల్డ్‌ ధర ఏకంగా 75 వేల రూపాయల మార్క్‌ను తాకగా.. వెండి కిలో ధర లక్ష రూపాయలకు చేరుకుంది. పెరుగుతున్న గోల్డ్‌, సిల్వర్‌ రేట్లను చూసి జనాలు ఆందోళనకు గురయ్యారు. అంతేకాక పది గ్రాముల పసిడి ధర లక్ష రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అనే మాట వినిపించింది. అయితే తాజాగా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి రేటు భారీగా దిగి వచ్చింది.

ఇక నేటి నుంచి అనగా సోమవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం అయ్యింది. ఈ మాసం మొదలయ్యిందంటే శుభకార్యాలు, పండగలు మొదలవుతాయి. వరలక్ష్మీ వ్రతం, వివాహాది శుభకార్యాలకు ముహుర్తాలు వంటివి ఉంటాయి. దాంతో పసిడి కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. డిమాండ్‌ పెరిగితే.. గోల్డ్‌ రేటు పెరిగే అవకాశం ఉంది. అయితే బడ్జెట్‌ ముందు వరకు కూడా దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర దూసుకుపోగా.. బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగి దిగి వచ్చింది. పది​ గ్రాముల మీద ఏకంగా 7 వేల రూపాయల వరకు తగ్గింది. అయితే శ్రావణం మొదలు కావడంతో.. గోల్డ్‌ రేటు పెరిగే అవకాశం ఉంది కనుక.. బంగారం కొనాలనుకునేవారు ఇప్పుడే త్వరపడితే మంచిది అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. పైగా చేతిలో రూపాయి లేకున్నా బంగారం కొనుగోలు చేయవచ్చు అంటున్నారు. అదేలానో ఇప్పుడు చూద్దాం.

డబ్బులు లేకున్నా బంగారం కొనొచ్చు..

బంగారం రేటు తగ్గింది.. ఎంతో కొంత కొంటే బాగుండు అనిపిస్తుంది.. కానీ చేతిలో పెద్దగా నగదు లేదు.. మరి ఎలా అంటే.. మీ దగ్గర పాత బంగారం ఉంటే చాలు.. కొత్తగా గోల్డ్‌ కొనుగోలు చేయవచ్చు. ఎలా అంటే.. మీ దగ్గర ఉన్న పాత గోల్డ్‌ని బ్యాంకులో పెడితే.. నగదు వస్తుంది. దాన్ని ఉపయోగించుకుని ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయవచ్చు. అయితే ఇక్కడ పసిడిని బ్యాంకులో పెట్టడం వల్ల ఇంట్రెస్ట్‌ రేటు తక్కువ ఉండటమే కాక.. నెలనెలా వడ్డీ కట్టాలనే బాధ ఉండదు. పైగా ఇది పొదుపుగా కూడా మారుతుంది. బంగారం బ్యాంకులో ఉంటే.. ప్రతి నెలా ఎంతో కొంత కట్టి దాన్ని విడిపించుకోవాలనే ఆలోచన వస్తుంది. దాంతో ఖర్చులను కట్టడి చేసి.. బంగారం తాకట్టు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తాం.

దీని వల్ల ఇటు పొదుపు చేసినట్లే కాక.. తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసిన వారవుతారు. ఎందుకంటే పుత్తడి ధర ఎప్పుడు పెరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. మొన్నటి వరకు 70, 75 వేలు పలికిన ధర ఇప్పుడు 64, 70 వేలకు దిగి రావడం శుభపరిణామం. ఇలాంటి సమయంలో గోల్డ్‌ కొంటే.. అన్ని విధాలా కలిసి వచ్చే అంశమే అవుతుంది తప్ప దీని వల్ల మీరు నష్టపోయే ఛాన్స్‌ ఏమాత్రం లేదు అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. కనుక బంగారం కొనాలని భావించి.. చేతిలో డబ్బులు లేని వారు ఇలా మీ పాత బంగారాన్ని వినియోగించుకోవడం బెటర్‌ ఐడియా అంటున్నారు. ఈ ఐడియా యూజ్‌ అయితే మీరు కూడా వాడుకొండి.

Show comments