SBI కస్టమర్లకు అలర్ట్.. నేడు ఆ సమయంలో సేవలన్ని బంద్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు కీలక అలర్ట్ జారీ చేసింది. నేడు ఆ సేవలన్ని బంద్ అవుతాయని పేర్కొంది. ఆ వివరాలు...

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు కీలక అలర్ట్ జారీ చేసింది. నేడు ఆ సేవలన్ని బంద్ అవుతాయని పేర్కొంది. ఆ వివరాలు...

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండో పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు కీలక అలర్ట్ జారీ చేసింది. బ్యాంకు సేవలకు సంబంధించి కీలక సమాచారం అందించింది. ఇంతకు ఎస్‌బీఐ తన కస్టమర్లకు దేని గురించి అలర్ట్ జారీ చేసింది అంటే.. అది అందించే సేవలన్నింటికి నేడు కాస్త అంతరాయం కలిగే అవకాశం ఉందని.. అవన్ని బంద్ అవుతాయని చెప్పుకొచ్చింది. ఇంతకు ఎందుకు ఎస్‌బీఐ సేవల్లో అంతరాయం ఏర్పడనుంది.. అందుకు కారణం ఏంటి వంటి వివరాలు మీ కోసం..

ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యోనో బిజినెస్ వెబ్, యోనో మొబైల్ యాప్, యోనో, యూపీఐ సేవలకు సోమవారం నాడు అనగా ఏప్రిల్ 1, 2024 రోజున అంతరాయం ఏర్పడనుందని బ్యాంక్ తెలిపింది. వార్షిక ఖాతా ముగింపు కార్యక్రమాల కారణంగా ఈ సేవలు నిలిచిపోనున్నాయని ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్ లో చెప్పుకొచ్చింది. అంతేకాక ఆయా సేవలు ఏ సమయాల్లో నిలిచిపోనున్నాయో.. కచ్చితమైన టైమింగ్స్ గురించి కూడా వెల్లడించింది. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించి అందుకు అనుగుణంగా తమ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని పేర్కొన్నది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం.. ఏప్రిల్ 1, 2024 రోజున సాయంత్రం 4.10-7.10 గంటల వరకు డిజిటల్ సేవలు నిలిచిపోనున్నాయి. అయితే ఈ సమయంలో యూపీఐ లైట్, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. యాన్యువల్ అకౌంట్ క్లోజింగ్ కారణంగా ఎస్‌బీఐలో మాత్రమే కాక ఇతర బ్యాంకుల సేవల్లో కూడా అంతరాయం ఏర్పడనుంది.

బ్యాంక్ కస్టమర్లు ఇవాళ ఏదైనా ట్రాన్సాక్షన్లు నిర్వహించే ముందు ఆ సేవలు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవడం మంచిది అంటున్నారు. ఇవాళ బ్యాంకింగ్ సర్వీసులకు దూరంగా ఉండడమే మంచిది అంటున్నారు. కొన్నిసార్లు డబ్బులు కట్ అయి ట్రాన్సాక్షన్ పూర్తి కాకపోవచ్చు. కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ పూర్తయ్యేందుకు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునే వారు కూడా దీనిపై అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు.

Show comments