iDreamPost
android-app
ios-app

SBI పరువు తీసిన కస్టమర్.. ప్రపంచం పూర్తిగా మారవచ్చు, కానీ మీ సేవలు మారవంటూ..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన ఓ కస్టమర్ ఆ బ్యాంక్ పరువు తీశారు. బ్యాంకు సిబ్బంది అంతా మూకుమ్మడిగా లంచ్ చేస్తూ కస్టమర్ల సేవల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ఇక మీ సేవల్లో మార్పు రాదంటూ పోస్టు చేశాడు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన ఓ కస్టమర్ ఆ బ్యాంక్ పరువు తీశారు. బ్యాంకు సిబ్బంది అంతా మూకుమ్మడిగా లంచ్ చేస్తూ కస్టమర్ల సేవల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ఇక మీ సేవల్లో మార్పు రాదంటూ పోస్టు చేశాడు.

SBI పరువు తీసిన కస్టమర్.. ప్రపంచం పూర్తిగా మారవచ్చు, కానీ మీ సేవలు మారవంటూ..

బ్యాంకు ఖాతాదారులు అకౌంట్ కు సంబంధించిన పనుల కోసం, లోన్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల సమస్యలు, ఇతర అవసరాల కోసం బ్యాంకులను సందర్శిస్తుంటారు. అయితే అన్ని పనులు వదులుకుని సమయాన్ని వెచ్చించి బ్యాంకుకు వెళితే అక్కడి సిబ్బంది నిర్వాకం వల్ల కస్టమర్లు అసహనానికి గురైన సంఘటనలు చాలానే ఉన్నాయి. బ్యాంకు సిబ్బంది సరిగా స్పందించకపోవడం, లేదా అసలు కౌంటర్లో ఎవరూ కూడా ఉండకపోవడం వంటి ఘటనలతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాగే ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సందర్శించిన కస్టమర్ కు ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకోవడంతో తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఇంకేముందు ఎస్బీఐ తీరును ఎండగడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ప్రపంచం పూర్తిగా మారొచ్చు, కానీ మీ సేవలు మాత్రం మారవు అంటూ చురకలంటించాడు.

ప్రభుత్వ బ్యాంకు సిబ్బంది ఖాతాదారులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని గతంలో చాలాసార్లు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఖాతాదారుల సమయాన్ని వృథా చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదే విధంగా ఎస్బీఐకి చెందిన ఓ కస్టమర్ బ్యాంక్ కు వెళ్లిన సమయంలో సిబ్బంది అంతా లంచ్ లో ఉండడంతో సేవలకు అంతరాయం కలిగింది. వాస్తవానికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు సిబ్బందికి లంచ్ బ్రేక్ ఉండదు. దీంతో ఆ కస్టమర్ ఫొటో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రపంచం పూర్తిగా మారవచ్చు, కానీ మీ సేవలు మారవు అని రాసుకొచ్చాడు. ఇంకేముంది ఈ పోస్టు క్షణాల్లోనే నెట్టింటా వైరల్ గా మారింది.

మధ్యాహ్న 3 గంటలు అవుతుంది. మొత్తం సిబ్బంది భోజనంలో ఉన్నారు. ఒక వైపు ఎస్బీఐ సిబ్బంది మాకు భోజన విరామం లేదు అంటూనే మొత్తం సిబ్బంది సమిష్టిగా భోజనం చేశారు. ఎస్బీఐ అధికారులారా ప్రపంచం కూడా పూర్తిగా మారవచ్చు కానీ మీ సేవలు మారవు అని లలిత్ సోలంకి ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో ఎస్బీఐ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా స్పందించింది. కలిగించిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేసింది. ఆ ట్వీట్‌ను తొలగించమని కస్టమర్ ను కోరింది. అంతే కాదు భద్రతా కారణాల దృష్ట్యా బ్రాంచ్ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ/వీడియోగ్రఫీ నిషేధించాం. దీన్ని దుర్వినియోగం చేస్తే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందనడంతో సీఏ లలిత్ సోలంకి ట్వీట్‌ను డిలీట్ చేశారు. మరి మీరు కూడా బ్యాంక్ కు వెళ్లినప్పుడు ఇలాంటి అసౌకర్యానికి గురయ్యారా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.