SBI కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి పెరగనున్న ఆ చార్జీలు

దేశంలో అతి పెద్ద విత్త సంస్థల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). ఇప్పుడు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పనుంది. ఏప్రిల్ 1 నుండి ఆ చార్జీల పెంపునకు రంగం సిద్దం చేయనుంది.

దేశంలో అతి పెద్ద విత్త సంస్థల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). ఇప్పుడు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పనుంది. ఏప్రిల్ 1 నుండి ఆ చార్జీల పెంపునకు రంగం సిద్దం చేయనుంది.

డబ్బు ఇంట్లో పెట్టాలంటే దొంగల భయం. ఎవరికైనా ఇవ్వాలంటే తిరిగి చెల్లిస్తారో లేదోనన్న ఆందోళన. పోనీ ఎవరికైనా ఇచ్చి దాయమని చెబుదామా అంటే.. మోసం చేస్తారన్న సందేహం. పోనీ ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడి పెడదామా అంటే నష్టం వచ్చే అవకాశాలున్నాయన్న అపోహ. అందుకే సంపాదించిన సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్స్, సేవింగ్స్ రూపంలో భద్ర పరుస్తుంటారు. బ్యాంకులు అంటేనే నమ్మకానికి అమ్మ వంటివి. ఇందులో మన సొమ్ములను భద్ర పరిస్తే..సేఫ్ అండ్ సెక్యూర్డ్ అన్న విశ్వాసం బలంగా ఉంది జనాల్లో. ప్రైవేట్ మినహా మిగిలిన బ్యాంకులన్నీ.. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్యర్యంలో నడుస్తున్న నేపథ్యంలో తమ దుడ్డును వచ్చిన నష్టమేమీ లేదన్న భరోసాతో గుండెల మీద హాయిగా చేతులు వేసుకుని నిద్రపోతుంటారు కస్టమర్లు.

అలా నమ్మకానికి పునాదిగా మారింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలోనే అతి పెద్ద విత్త సంస్థ అయిన ఎస్‌బీఐలో ఖాతాదారులు కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు కస్టమర్లకు ఝలక్ ఇవ్వనుంది. ఇందులో ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరికి డెబిట్ కార్డు ఉంటుంది. ఇప్పుడు ఈ కార్డులకు సంబంధించి వార్షిక నిర్వహణ చార్జీలను అమాంతం పెంచే పనిలో పడింది. బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం.. డెబిట్ కార్డుల నిర్వహణ చార్జీలను రూ. 75కు పెంచింది. దీనికి జీఎస్టీ అదనం కూడా . పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి. ఎస్‌బీఐ తమ కస్టమర్లకు అనేక సేవలను అందిస్తుంది. ఇందులో ఒకటి డెబిల్ కార్డులు కూడా. డెబిట్ కార్డుల్లో కూడా వివిధ రకాలున్నాయి. ఇందులో క్లాసిక్, గోల్డ్, ప్లాటినం, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులను తీసుకు వచ్చింది.

ఇప్పటి వరకు  వార్షిక నిర్వహణ చార్జీల కింద ఒక్కో కార్డుకు ఒక్కో రుసుము వసూలు చేస్తుంది. గ్లోబల్ కార్డుకు వార్షిక నిర్వహణ చార్జీలు 125 రూపాయలతో పాటు జీఎస్టీ వసూలు చేస్తుండగా.. దీనికి 75 రూపాయలు అదనంగా పడనుంది. అంటే రూ. 200 ప్లస్ జీఎస్టీ వసూలు చేయనుంది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డుల నిర్వహణ రుసుములు రూ. 175 ప్లస్ జీఎస్టీ ఉండగా.. ఏప్రిల్ 1 తర్వాత.. 250 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఉండనుంది. ఇక ప్లాటినం డెబిట్ కార్డు వార్షిక నిర్వహణ రుసుము 250 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఉండగా.. ఇప్పుడు ఈ 75 రూపాయలు కలుపుకుని.. రూ. 325తో పాటు జీఎస్టీ అదనంగా వసూలు చేయనుండి ఎస్‌బీఐ. ఈ రోజుల్లో డెబిట్ కార్డు లేని వారు లేరు. ఏప్రిల్ 1 నుండి డెబిట్ కార్డు యూజర్లందరి నుండి ఈ మొత్తంలో రాబట్టనుంది.

Show comments