బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు కొత్తకొత్త పథకాలను తీసుకొస్తూనే ఉంటాయి. ఇక కొన్ని బ్యాంకులు కస్టమర్లకు భారీగా డిస్కౌంట్స్ ప్రకటిస్తుంటాయి. మీరు SBI కస్టమరా? ఈ బ్యాంక్ లో సేవింగ్స్ ఖాతా కలిగిఉన్నారా? అయితే బ్యాంక్ మీకు ఓ శుభవార్త తీసుకొచ్చింది. ఈ బ్యాంక్ కస్టమర్లకు అదిపోయే డిస్కౌంట్ ఆఫర్ ను కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. కారు కొనుగోలుపై కళ్లు చెదిరే డీల్ ను తమ ఖాతాదారుల కోసం అందుబాటులో ఉంచింది. మరి భారీ డిస్కౌంట్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
SBI.. తన ఖాతాదారులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. కార్ల కొనుగోళ్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. ఇక కార్లు కొనుగోలు చేయాలి అనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్ అంటోంది ఎస్బీఐ. నేటి సమాజంలో సొంత కారు ఉండాలనేది సామాన్య ఉద్యోగి కోరిక. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఎస్బీఐ ఈ డిస్కౌంట్ ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ఆఫర్లకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. మీరు టాటా మోటార్స్ కంపెనీ కారును కొనుగోలు చేయాలనుకుంటే.. రూ. 5 వేల వరకు అదనపు క్యాష్ డిస్కౌంట్ ను పొందొచ్చు. అయితే టాటా కార్లు కొనుగోలు చేసే వారికి ఈ డీల్ వర్తిస్తుంది. మారుతీ సుజుకీ కారు కూడా మీరు కొనుగోలు చేయోచ్చు.
మరో ప్రముఖ కంపెనీ మహీంద్రా కారుపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఈ వాహనంపై ఉచితంగా రూ. 3 వేల యాక్ససిరీస్ పొందొచ్చు. ఇక వీటన్నింటి కంటే ఆడి కారుపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ కారుపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అదనపు క్యాష్ డిస్కౌంట్ రూపంలో కారు కొనేవారికి అందుబాటులో ఉంది. ఇక కియా కార్లపై బంపర్ బోనాంజా ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కార్లపై ఏకంగా రూ. 1.57 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారుడు పొందవచ్చు. ప్రస్తుతం కియా కారు కొనాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెప్పాలి.
వీటన్నింటితో పాటుగా కారు కొనాలి అనుకునే వారికి సులభతరమైన లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. తక్కువ వడ్డీ రేటుతో పాటుగా 100 శాతం ఫైనాన్స్ ఆప్షన్ కూడా పొందవచ్చు. కాగా.. కారు కొనుగోలు చేయాలని భావించే వారు ఎస్బీఐ యోనో యాప్ లోకి వెళ్లి ఈ బెనిఫిట్ ను పొందొచ్చు. అయితే ఎస్బీఐ అందిస్తున్న ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటాయి. కాబట్టి సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునే వారు వెంటనే ఈ డీల్స్ ను సొంతం చేసుకోండని కస్టమర్లకు బ్యాంకు సూచిస్తోంది.
ఇదికూడా చదవండి: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రూ.50 లక్షల వరకు లోన్.. పూర్తి వివరాలు ఇవే!