P Venkatesh
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ను అతిక్రమించే బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. ఆ బ్యాంకులపై ఆంక్షలు విధించింది. నేటి నుంచి ఆ బ్యాంకులో లావాదేవీలు బంద్ కానున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ను అతిక్రమించే బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. ఆ బ్యాంకులపై ఆంక్షలు విధించింది. నేటి నుంచి ఆ బ్యాంకులో లావాదేవీలు బంద్ కానున్నాయి.
P Venkatesh
కేంద్ర బ్యాంకు అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతోంది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకులు రూల్స్ అతిక్రమించినందుకు భారీగా జరిమానాలు విధించిన విషయం తెలిసిందే. మరికొన్ని బ్యాంకుల లైసెన్స్ లను సైతం రద్దు చేసింది. తాజాగా మరో రెండు బ్యాంకులపై చర్యలు తీసుకుంది. నేటి నుంచి ఆ రెండు బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ బంద్ కానున్నాయి. మరి మీకు ఆ బ్యాంకుల్లో ఖాతా ఉందేమో చెక్ చేసుకోండి. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి కారణంగా ఆర్బీఐ ఆంక్షలు విధించింది.
బ్యాంకు ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఆర్బీఐ కోణార్క్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (కోణార్క్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్)పై అనేక ఆంక్షలు విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35A ప్రకారం ఈ పరిమితి విధించబడింది. ఆర్బీఐ విధించిన ఈ పరిమితులు నేటి నుంచే అమలులోకి వచ్చాయి. దీనిలో డబ్బు విత్‌డ్రాతో సహా దానిపై అనేక ఆంక్షలు విధించింది. మీరు ఈ బ్యాంకు ఖాతాదారులైతే ఇప్పుడు డబ్బు తీసుకోలేరు. అలాగే, బ్యాంకు ఎవరికీ లోన్ ఇవ్వదు. ఈ బ్యాంక్ ఇకపై కొత్త రుణాలు లేదా లోన్ రెన్యువల్ చేయడం కుదరదు.
ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు. డబ్బులను ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ కు బదిలీ చేయాలన్నా చేయలేరు. బ్యాంకు ఆర్థిక పరిస్థితిని దారిలోకి తెచ్చేందుకే ఆర్భీఐ ఆంక్షలు విధించింది. అయితే బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షలు విధించినా లేదా లైసెన్స్ లను రద్దు చేసినా ఖాతా దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి తమ డిపాజిట్లలో రూ. 5 లక్షల వరకు బీమా పొందేందుకు అర్హులు.
ఆర్బీఐ ప్రైవేట్ బ్యాంక్ అయిన కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఆన్ లైన్ సేవలపై ఆంక్షలు విధించింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ పై కఠిన చర్యలు తీసుకన్న ఆర్బీఐ కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, కొత్త క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయకుండా నిలిపివేసింది. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కస్టమర్‌లను చేర్చుకోకుండా ఆంక్షలు విధించింది. ఈ మేరకు 2024, ఏప్రిల్ 24వ తేదీన ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. కాగా కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ప్రస్తుత కస్టమర్లకు, క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు మునుపటిలాగే సేవలను కొనసాగిస్తుందని ఆర్‌బిఐ స్పష్టం చేసింది.