Jio Recharge Plans 2024: యూజర్లకు Jio మరో షాక్.. ఆ రెండు పాపులర్ ప్లాన్స్ నిలిపివేత

యూజర్లకు Jio మరో షాక్.. ఆ రెండు పాపులర్ ప్లాన్స్ నిలిపివేత

Jio Recharge Plans 2024: దిగ్గజ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను పెంచి యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ రెండు పాపులర్ ప్లాన్లను నిలిపి వేసి మరో షాక్ ఇచ్చింది.

Jio Recharge Plans 2024: దిగ్గజ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను పెంచి యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ రెండు పాపులర్ ప్లాన్లను నిలిపి వేసి మరో షాక్ ఇచ్చింది.

మొబైల్ యూజర్లకు టెలికాం కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తమ టారిఫ్ లను భారీగా పెంచాయి. ఈ క్రమంలో రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్‌లలో 12-27 శాతం పెంపును ప్రకటించింది. పెరిగిన రీఛార్జ్ ప్లాన్ల ధరలు జులై 3 నుంచి అమల్లోకిరానున్నాయి. పెరిగిన రీఛార్జ్ ధరలతో మొబైల్ ఫోన్ యూజర్లపై మరింత ఆర్థిక భారం పడనున్నది. ఈ నేపథ్యంలో జియో తమ యూజర్లకు మరో షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ధరలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న యూజర్లకు జియో ఆ రెండు పాపులర్ ప్రిపేయిడ్ ప్లాన్లను నిలిపివేసి గట్టి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ రెండు ప్లాన్స్ ఏంటంటే?

ప్రస్తుతం మొబైల్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చేతిలో ఫోన్ లేకుండా నిమిషం గడవని పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం తప్పనిసరిగా మారింది. అయితే టెలికాం కంపెనీల ఛార్జీల మోతతో యూజర్లు ఉసూరుమంటున్నారు. ఈ క్రమంలో జియో యూజర్లు ఎక్కువగా వాడే 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ. 395, 336 రోజుల వ్యాలిడిటీతో లభించే రూ. 1,559 ప్లాన్లను తొలగించింది. ఈ రెండు ప్లాన్లు కనిపించడం లేదని యూజర్లు ఎక్స్ లో కంప్లైంట్ చేస్తున్నారు. ఇక రేపటి నుంచి రీఛార్జ్ ధరలు పెరగనుండడంతో ముందుగానే ప్రస్తుత ధరలతో రీఛార్జ్ చేసుకుంటున్నారు.

ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లు అపరిమిత 5జీ డేటాతో ఎక్కువ మందిని ఆకర్షించాయి. జియో నిర్ణయంతో టారిఫ్ పెంపు కారణంగా వీటిని రీఛార్జ్ చేయాలని భావించిన కస్టమర్లకు ఇవి అందుబాటులో లేవు. ఈ రెండు ప్లాన్ల నుంచి తక్కువ ఆదాయం ఉండడం కారణంగా ఈ ప్లాన్లను నిలిపివేసినట్లు టెలికాం వర్గాలు భావిస్తున్నాయి. ఇక దిగ్గజ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచడంతో యూజర్లు ప్రత్యామ్నాయ నెట్ వర్క్ లవైపు చూస్తున్నారు. బీఎస్ఎన్ ఎల్ లో తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్న ప్లాన్స్ అందుబాటులో ఉండడంతో ఈ నెట్ వర్క్ కు మారేందుకు యూజర్లు ఇంట్రెస్టు చూపిస్తున్నారు.

Show comments