iDreamPost
android-app
ios-app

BSNL నుంచి మరో అదిరిపోయే బంపర్ ప్రీపెయిడ్ ప్లాన్!

  • Published Sep 06, 2024 | 11:00 PM Updated Updated Sep 06, 2024 | 11:00 PM

BSNL: వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం కోసం BSNL మంచి మంచి ప్లాన్ లని అందుబాటులోకి తీసుకు వస్తుంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ మరో సూపర్ టారిఫ్ ప్లాన్ ని తీసుకొచ్చింది.

BSNL: వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం కోసం BSNL మంచి మంచి ప్లాన్ లని అందుబాటులోకి తీసుకు వస్తుంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ మరో సూపర్ టారిఫ్ ప్లాన్ ని తీసుకొచ్చింది.

BSNL నుంచి మరో అదిరిపోయే బంపర్ ప్రీపెయిడ్ ప్లాన్!

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ టెలికామ్ కంపెనీలు వరుసగా ఒకదాని మించి ఒకటి రీఛార్జ్ ధరలని భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీలు తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయంపై ఆ నెట్ వర్క్ యూజర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ ధరల పెంపుపై నెట్టింట నెగటివిటీ పెరిగింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఊరట కలిగించింది. వినియోగదారుల కోసం ఆకర్షించే రీఛార్జ్ ధరలు ప్రకటిస్తుంది. దాంతో అందరూ ఈ చౌకైన ధరల వైపు ఆకర్షితులైవుతున్నారు. BSNL వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం కోసం మంచి మంచి ప్లాన్ లని అందుబాటులోకి తీసుకు వస్తుంది.

బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను సైతం వేగవంతం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో లక్షలాదిమంది యూజర్స్ BSNL నెట్ వర్క్ కి మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కస్టమర్లను ఇంకా ఆకట్టుంరేందుకు సరసమైన ధరలకే బీఎస్ఎన్ఎల్ టారిఫ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా బీఎస్ఎన్ఎల్ మరో సూపర్ టారిఫ్ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో అపరిమిత కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, హై-స్పీడ్ 4G డేటా వంటి ఎన్నో రకాల ప్రయోజనాలని తీసుకొచ్చింది. ఇక BSNL అందిస్తున్న ఈ కొత్త ప్లాన్ ఏంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ప్లాన్ కూడా బడ్జెట్ ధరలో ఎక్కువ రోజులు చెల్లుబాటు అయ్యే సూపర్ డూపర్ ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 298 ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 52 రోజుల వ్యాలిడిటీ తో రానుంది. ఈ ప్లాన్ 52 రోజుల పాటు ఉంటుంది. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. కానీ ఈ ప్లాన్ రోజుకు కేవలం 1GB హై స్పీడ్ డేటాని మాత్రమే అందిస్తుంది. కానీ, డైలీ డేటా ముగిసిన తర్వాత కూడా 40kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని వినియోగ పరచుకునే అవకాశం ఉంది. ఈ ప్లాన్ తో డైలీ 100 SMS లు చేసుకునే సౌకర్యం కూడా పొందవచ్చు. మరీ BSNL నెట్ వర్క్ యూజర్స్ కు అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.