iDreamPost
android-app
ios-app

జియో, ఎయిర్‌టెల్‌‌ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన BSNL.. ఇక నుంచి ఆ సమస్య ఉండదు!

  • Published Oct 18, 2024 | 5:39 PM Updated Updated Oct 18, 2024 | 5:39 PM

BSNL: BSNL తన వినియోగదారులకు చవకైన ప్లాన్స్ అందిస్తూ మంచి గుర్తింపు పొందింది. తాజాగా మరో టెక్నాలజీని తీసుకురాబోతుంది.

BSNL: BSNL తన వినియోగదారులకు చవకైన ప్లాన్స్ అందిస్తూ మంచి గుర్తింపు పొందింది. తాజాగా మరో టెక్నాలజీని తీసుకురాబోతుంది.

జియో, ఎయిర్‌టెల్‌‌ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన BSNL.. ఇక నుంచి ఆ సమస్య ఉండదు!

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ నెట్వర్క్స్ టెలికాం రంగంలో తిరుగులేని కంపెనీలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమ ప్లాన్స్ రేట్లు పెంచినా కూడా స్టాండర్డ్ యూజర్లను మెయింటైన్ చేస్తూ ముందుకు వెళుతున్నాయి. దానికి కారణం వీటి సిగ్నల్స్. ఈ నెట్ వర్క్స్ వాడే యూజర్లకు పెద్దగా సిగ్నల్ ప్రాబ్లం ఉండదు. అందుకే ఈ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్స్ పెంచినా కూడా కస్టమర్స్ తగ్గరు. ఆ ధీమాతోనే ఈ నెట్ వర్క్స్ టెలికాం రంగంలో చలామణీ అవుతున్నాయి. అయితే వీటికి గవర్నమెంట్ టెలికాం కంపెనీ BSNL మాత్రం పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ప్రజలకు అందుబాటు ధరలో చవక రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంది BSNL. దాంతో చాలా మంది ఈ నెట్ వర్క్ కి మారారు. ఆ విధంగా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు షాక్ ఇచ్చింది BSNL. ఇక ఇప్పటికే అల్లడిపోతున్న జియో, ఎయిర్టెల్ కంపెనీలకు తాజాగా మరో సారి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది BSNL. ఇంతకీ BSNL ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ఇచ్చిన ఆ షాక్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

BSNL ఎంత తక్కువ ధరకి మంచి ప్లాన్స్ అందిస్తున్నా కానీ ఇప్పటికీ ఒక మాయని మచ్చని పెట్టుకుంది. అదే పూర్ సిగ్నల్స్. ఇది BSNL కి ఎప్పటి నుంచి తీరని సమస్యగా మిగిలింది. సిగ్నల్స్ ప్రాబ్లెం కారణంగా చాలా మంది BSNL కి మారడానికి ఆలోచిస్తున్నారు. అయితే తాజాగా ఈ మచ్చని చెరిపేసుకోవాడానికి సిద్ధం అవుతుంది BSNL. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అందిస్తున్న వియసత్‌(VIASAT)తో టై అప్ అవుతుంది. దానితో కలిసి ఓ కొత్త టెక్నాలజీని BSNL అందుబాటులోకి తీసుకొస్తుంది.ఆ టెక్నాలజీ పేరు Direct to Device. ఈ టెక్నాలజీ ద్వారా మొబైల్ టవర్లతో పనిలేకుండానే ఫోన్ కాల్స్ వచ్చే విధంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లు శాటిలైట్ కమ్యూనికేషన్‌పై పని చేస్తాయి. ఈ టెక్నాలజీపై బీఎస్ఎన్ఎల్ చేసిన ట్రయల్స్ కూడా సక్సెస్ అయ్యాయట. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఇద్దరికీ కూడా అందుబాటులోకి రానుంది. కేవలం సిటీలల్లోనే కాదండోయ్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎనీ టైమ్ సిగ్నల్స్ ఉండేలా BSNL ఈ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ టెక్నాలజీ ద్వారా మొబైల్లో సిమ్ కార్డు కూడా అవసరం లేదట. సిమ్ కార్డ్ లేకుండానే కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ వాచ్లు, ఇంటర్నెట్ ఉన్న కార్లు, టాబ్, లాప్టాప్ లలో కూడా కాల్స్ మాట్లాడుకోవచ్చట. పర్సనల్, డివైజ్ కమ్యూనికేషన్‌కు సపోర్ట్ చేసే విధంగా దీనిని డిజైన్ చేశారు. ఎక్కడున్నా కానీ ఎనీ టైమ్ కనెక్టివిటీని ఈ టెక్నాలజీ అందిస్తుంది. యూజర్లకు ఇది మంచి కవరేజీ ఇవ్వడంతోపాటు అద్భుతమైన కమ్యూనికేషన్ ని ఇస్తుందట. ఈ టెక్నాలజీ వల్ల మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ టెక్నాలజీకి మొబైల్ టవర్లతో పని ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే శాటిలైట్ ఫోన్లలాగా అన్నమాట. BSNL కొన్ని రోజులుగా దీనిపైన ప్రయోగాలు చేస్తుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కొన్ని వందల కాల్స్ కూడా ట్రయల్ చేసింది. కొద్ది నెలల్లోనే ప్రజలకు ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉందట. ఒకవేళ ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందంటే జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలకు చుక్కలు కనిపించడం ఖాయం. ఇక BSNL తీసుకురానున్న ఈ Direct to Device టెక్నాలజీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.