iDreamPost
android-app
ios-app

రీచార్జ్ ధరలను తగ్గించనున్న Jio, Airtel.. అయినా ఆ యూజర్లకు నష్టమే.. ఎందుకంటే?

Jio, Airtel: టెలికాం కంపెనీలు మొబైల్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించనున్నాయి. త్వరలోనే రీచార్జ్ ధరలను తగ్గించేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఆ యూజర్లకు మాత్రం లాభం ఉండదు.

Jio, Airtel: టెలికాం కంపెనీలు మొబైల్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించనున్నాయి. త్వరలోనే రీచార్జ్ ధరలను తగ్గించేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఆ యూజర్లకు మాత్రం లాభం ఉండదు.

రీచార్జ్ ధరలను తగ్గించనున్న Jio, Airtel.. అయినా ఆ యూజర్లకు నష్టమే.. ఎందుకంటే?

జులైలో టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా రీచార్జ్ ధరలను పెంచి యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చాయి. దీంతో మొబైల్ యూజర్లు అసహనం వ్యక్తం చేశారు. నెల నెలా రీచార్జ్ చేయకపోతే సర్వీస్ నిలిచిపోతుంది. కాబట్టి రీచార్జ్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఇక ఇంట్లో రెండు ఫోన్లు ఉన్నవారు, రెండు నెంబర్స్ యూజ్ చేసే వారికి రీచార్జ్ ధరలు భారంగా మారాయి. ఉన్న ఖర్చులకు తోడు పెరిగిన రీచార్జ్ ధరలు అదనపు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో రీచార్జ్ ధరలు తక్కువగా ఉన్న నెట్ వర్క్ లకు మారేందుకు సిద్ధమయ్యారు. బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు వేలాది మంది క్యూ కట్టారు. దిగ్గజ టెలికాం కంపెనీలకు యూజర్లు నెట్ వర్క్ మారి బిగ్ షాక్ ఇచ్చారు.

ఈ క్రమంలో జియో ఎయిర్ టెల్ దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు, ఉన్న కస్టమర్లను కాపాడుకునేందుకు తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నాయి. దీంతో మొబైల్ యూజర్లకు కాస్త ఊరట లభించినట్లైంది. ఇక ఇప్పుడు దీపావళి పండగ వేళ తమ కస్టమర్లకు ఎయిర్ టెల్, జియో, వీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించనున్నట్లు సమాచారం. గతంలో పెంచిన ధరలను మళ్లీ తగ్గించేందుకు రెడీ అవుతున్నాయట. టెలికాం కంపెనీలు త్వరలోనే రీచార్జ్ ధరలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. నెల వారీ రీచార్జ్ ప్లాన్స్, వార్షిక ప్లాన్స్ ధరలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. అయితే రీచార్జ్ ధరలు తగ్గినప్పటికీ వారికి మాత్రం లాభం ఉండదనే చెప్పాలి.

ఎందుకంటే ఇప్పటికే వార్షిక రీచార్జ్ ప్లాన్స్ తో రీచార్జ్ చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారు ఇప్పుడు తగ్గబోయే రీచార్జ్ ప్లాన్స్ ను ద్వారా లాభం పొందాలంటే వారి రీచార్జ్ గడువు ముగిసేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఇంతకీ టెలికాం కంపెనీలు రీచార్జ్ ధరలను తగ్గించడానికి గల కారణం ఏంటంటే? టెలికాం కంపెనీలు కొత్త సంస్కరణలకు తెరలేపాయి. ప్రభుత్వాన్ని టెలికాం కంపెనీలు లైసెన్స్ ఫీజును తగ్గించాలని కోరుతున్నాయి. ప్రభుత్వం వారి డిమాండ్లను అంగీకరిస్తే, ఎయిర్టెల్ ,జియో, వీఐ రీఛార్జ్ ప్లాన్‌లు మరింత తగ్గే అవకాశం ఉంది. ప్రైవేట్ కంపెనీల డిమాండ్లను ప్రభుత్వం తీరుస్తే టెలికాం కంపెనీలు అదనపు భారాన్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది.

టెలికాం ఆపరేటర్ల ప్రయోజనాలను సూచించే సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, టెలికాం ఆపరేటర్లపై విధించే లైసెన్స్ ఫీజును తగ్గించాలని అధికారికంగా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రస్తుతం, లైసెన్స్ ఫీజు మొత్తం ఆదాయంలో 8 శాతం ఉంది, ఇందులో 5శాతం నెట్‌వర్క్ ఫీజు కూడా ఉంది. COAI ఈ ఫీజును 0.5% నుండి 1%కి తగ్గించాలని సిఫార్సు చేస్తోంది. ప్రభుత్వం అంగీకరిస్తే టెలికాం కంపెనీలు రీచార్జ్ ధరలను తగ్గించే వీలుంటుంది. మరి రీచార్జ్ ధరలు తగ్గుతాయన్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.