iDreamPost
android-app
ios-app

Jio 8th Anniversary: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్లు!

  • Published Sep 05, 2024 | 6:11 PM Updated Updated Sep 05, 2024 | 6:11 PM

Jio 8th Anniversary: జియో ప్రతి ఏడాది తన వార్షికోత్సవ సందర్భంగా ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇక తాజాగా 8వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది.

Jio 8th Anniversary: జియో ప్రతి ఏడాది తన వార్షికోత్సవ సందర్భంగా ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇక తాజాగా 8వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది.

Jio 8th Anniversary: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్లు!

రిలయన్స్ జియో ప్రతి ఏడాది కూడా తన వార్షికోత్సవ సందర్భంగా ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇక తాజాగా 8వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా జియో వార్షికోత్సవ ఆఫర్లని ప్రకటించింది. ఇక ఈ సందర్భంగా మూడు రీఛార్జ్ ప్లాన్ లతో మరిన్ని లాభాలను జియో ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. తన బెస్ట్ క్వార్టర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అయిన రూ. 899, రూ. 999 ఇంకా అలాగే బెస్ట్ యాన్యువల్ ప్లాన్ అయిన రూ. 3,599 ప్రీపెయిడ్ ప్లాన్ పైన అదనపు ప్రయోజనాలు ప్రకటించింది. ఇక ఈ ప్రయోజనాలు ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

జియో ప్రకటించిన ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ తేదిల లోపు రీఛార్జ్ చేసే యూజర్లకు ఈ ప్రయోజనాలు దక్కుతాయి. ఈ మూడు ప్లాన్స్ తో రూ. 175 రూపాయల విలువైన 28 రోజుల 10 OTT సబ్ స్క్రిప్షన్ మరియు 10GB ఫ్రీగా ఇస్తుంది. ఇంకా అలాగే తన అజియోలో రూ. 2999 రూపాయలు పైన షాపింగ్ చేసే వారికి రూ. 500 డిస్కౌంట్ కూడా ఉంటుంది. కేవలం ఇది మాత్రమే కాదు, మూడు నెలల జొమాటో గోల్డ్ మెంబెర్ షిప్ ను కూడా ఈ ఆఫర్ లో ఫ్రీగా ఇస్తుంది జియో. జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ కి 90 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా + 20 GB అదనపు డేటా మరియు డైలీ 100 SMSతో వస్తుంది. అంతేగాక జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటాని కూడా పొందవచ్చు.

జియో రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ తో 98 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాలింగ్, 4జి నెట్ వర్క్ పై డైలీ 2 GB డేటా ఇంకా రోజుకు 100 SMS లు పొందవచ్చు. ఈ పాన్ తో కూడా జియో ట్రూ 5జి అన్లిమిటెడ్ 5జి డేటా ప్రయోజనాలు పొందవచ్చు.ఇక జియో రూ. 3,599 ప్లాన్ ఒక సంవత్సరం (365 రోజులు) పాటు ఉంటుంది. ఈ ప్లాన్ తో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2.5 GB 4జి డేటా మరియు డైలీ 100 SMS లు పొందవచ్చు. ఇంకా ఈ ప్లాన్ తో కూడా జియో 5జి అన్లిమిటెడ్ డేటా బెనిఫిట్ పొందవచ్చు. ఈ మూడు ప్లాన్స్ తో మనం జియో టీవీ, జియో క్లౌడ్ ఇంకా జియో సినిమాలకి ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు. మరి జియో తన యానివర్సరీలో భాగంగా ప్రకటించిన ఈ ఆఫర్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.