Digital Payments-RBI, Alternative Authentication: UPI పేమెంట్లు చేసే వారికి RBI అలర్ట్‌.. కీలక ప్రతిపాదనలు

UPI పేమెంట్లు చేసే వారికి RBI అలర్ట్‌.. కీలక ప్రతిపాదనలు

RBI Alternative Authentication-Digital Payments: యూపీఐ పేమెంట్స్‌ చేసే వారికి ఆర్బీఐ కీలక అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

RBI Alternative Authentication-Digital Payments: యూపీఐ పేమెంట్స్‌ చేసే వారికి ఆర్బీఐ కీలక అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

ప్రస్తుతం దేశంలో డిజిటిల్‌ పేమెంట్స్‌ విపరీతంగా పెరిగాయి. చిన్న చిన్న కిరాణా దుకాణాలు మొదలు మాల్స్‌ వరకు డిజిటల్‌ పేమెంట్లు చెల్లుబాటు అవుతున్నాయి. డిజిటల్‌ పేమెంట్లు పెరుగుతున్న కొద్ది.. ఆన్‌లైన్‌ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు దీని గురించి ఎన్ని రకాలుగా ప్రజలను అప్రమత్తం చేసినా.. మోసాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం కోట్లల్లో సైబర్‌ మోసాలు జరుగుతున్నాయి. ఓటీపీ వ్యవస్థ అందుబాటులో ఉన్నా సరే.. ఈ తరహా మోసాలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో సెంట్రల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్బీఐ) కీలక ప్రతి పాదనలు చేసింది. యూపీఐ పేమెంట్లు చేసే వారి కోసం కీలక ప్రతిపాదనలు చేస్తూ.. ముసాయిదా ఫ్రేమ్‌వర్క్‌ విడుదల చేసింది ఆర్బీఐ.

యూపీఐ, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వంటి డిజిటల్‌ లావాదేవీల్లో ఎస్‌ఎంఎస్‌ ఆధారిత ఓటీపీ వ్యవస్థ అందుబాటులో ఉంది. అయినా సరే సైబర్‌ మోసాలు ఆగడం లేదు. ఈ క్రమంలో వీటిని అరికట్టడం కోసం ఓటీపీతో పాటు అదనపు అథెంటికేషన్‌ ఉండాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఓటీపీ వ్యవస్థ పని తీరు సక్రమంగా ఉన్నప్పటికీ.. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా.. వేరే అథెంటికేషన్‌ వ్యవస్థలు అవసరమని ఆర్బీఐ అభిప్రాయపడింది. అదనపు అథెంటికేషన్‌ యాక్టీవేట్‌ చేస్తున్నట్లయితే.. కస్టమర్‌ నుంచి అనుమతి తీసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీని నుంచి వైదొలగే అవకాశం కస్టమర్లకు కల్పించాలని చెప్పుకొచ్చింది.

అలానే అన్ని డిజిటల్‌ పేమెంట్లకు అలర్ట్‌ పంపడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ఆర్‌బీఐ తన ముసాయిదా ప్రతిపాదనల్లో తెలిపింది. మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌ ప్రీమియం, క్రెడిట్‌ కార్డు బిల్లు పేమెంట్లు రూ.1 లక్ష వరకు, రూ.15 వేల వరకు చేసే రికరింగ్‌ ట్రాన్సాక్షన్లకు ఇ-మ్యాండెట్‌ను తప్పనిసరి చేయాలని పేర్కొంది. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ టెర్నినళ్ల వద్ద కాంటాక్ట్‌లెస్‌ విధానంలో కార్డుల ద్వారా చేసే చిన్న లావాదేవీలకు అనగా రూ.5 వేల వరకు అథెంటికేషన్‌ నుంచి మినాహాయించవచ్చని సూచించింది. అలానే రూ7,500లోపు చేసే ఆఫ్‌లైన్‌ చెల్లింపు లావాదేవీలను కూడా దీన్నుంచి మినహాయించారు. అంతకు మించి లావాదేవీలు జరిపితే మాత్రం అథెంటికేషన్‌ ఉండాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ మూసాయిదాపై ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 వరకు అభిప్రాయాలను తెలపాలని పేర్కొంది.

Show comments