iDreamPost

RBI గుడ్ న్యూస్.. ఇకపై Bank ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా పర్లేదు..

బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఇకపై మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకున్న పర్లేదు. ఏవిధమైన ఛార్జీలు కూడా విధించబడవు.

బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఇకపై మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకున్న పర్లేదు. ఏవిధమైన ఛార్జీలు కూడా విధించబడవు.

RBI గుడ్ న్యూస్.. ఇకపై Bank ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా పర్లేదు..

బ్యాంక్ అకౌంట్ పలు అవసరాల కోసం ఓపెన్ చేస్తుంటారు. డబ్బును పొదుపు చేసేందుకు, లోన్ల కోసం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు బ్యాంక్ ఖాతాలు ఉండాల్సిందే. అయితే కొందరు వివిధ అవసరాల దృష్ట్యా ఒకటికంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉంటారు. వాటిలో ఏదో ఒకటి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. మిగతా అకౌంట్లను పెద్దగా పట్టించుకోరు. దీంతో ఆయా ఖాతాల్లో లావాదేవీలు ఏమీ జరగవు. చివరికి ఆ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ కూడా ఉండదు. కాగా బ్యాంకులు ఖాతాదురుల అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటాయి. ఈ ఛార్జీల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీరు మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయకపోయానా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం పొదుపు ఖాతాలు, కరెంట్ అకౌంట్ లలో రెండేళ్లకు మించి ట్రాన్సాక్షన్ చేయకపోతే ఆ ఖాతాలు ఇనాక్టీవ్ లోకి వెళ్తాయి. అదే విధంగా కనీస నిల్వలు ఉంచనందుకు ఫైన్ విధిస్తుంటాయి బ్యాంకులు. అయితే ఈ కనీస నిల్వలు నిర్వహించనందుకు బ్యాంకులు వేసే ఛార్జీలను చెల్లించక్కర్లేదని ఆర్బీఐ ప్రకటించింది. పనిచేయని ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయనందుకు జరిమానా విధించలేమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ద్వారా బ్యాంకులకు తెలియజేసింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం మీరు మీ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచకున్న పర్వాలేదు.

అకౌంట్ లో మైనస్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ రూపాయి కూడా బ్యాంకులకు చెల్లించాల్సిన పనిలేదు. సాధారణంగా ఇలాంటి అవసరం లేని ఖాతాలను కస్టమర్లు క్లోజ్ చేసే సమయంలో బ్యాంకులు జరిమానాలను వసూలు చేస్తుంటాయి. ఆర్బీఐ నిబంధనలతో ఇకపై మీరు ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే ఖాతాలను క్లోజ్ చేయొచ్చు. అంతే కాదు ఒకవేళ బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తే అది తిరిగి పొందే ఛాన్స్ ఉంది. మీరు దీనిపై ఆర్బీఐకి ఫిర్యాదు కూడా చేయొచ్చు. దీని కోసం మీరు bankingombudsman.rbi.org.in కు వెళ్లి ముందుగా మీ ఫిర్యాదును నమోదు చేసుకోవాలి. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి