RBI కొత్త రూల్.. ఇక క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ మరింత భారం..!

బ్యాంకుకు ఏదైనా లోన్ కోసం వెళుతుంటే..ఇప్పుటి వరకు ఓ లెక్క.. ఇప్పుడు మరో లెక్క. క్రెడిట్ కార్డ్స్, లోన్స్ అప్లై చేసుకుందామనుకునే ఇటీవల ఆర్బీఐ మార్చిన కొత్త రూల్ గురించి తెలుసుకోవడం మంచిది. ఆ రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

బ్యాంకుకు ఏదైనా లోన్ కోసం వెళుతుంటే..ఇప్పుటి వరకు ఓ లెక్క.. ఇప్పుడు మరో లెక్క. క్రెడిట్ కార్డ్స్, లోన్స్ అప్లై చేసుకుందామనుకునే ఇటీవల ఆర్బీఐ మార్చిన కొత్త రూల్ గురించి తెలుసుకోవడం మంచిది. ఆ రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో డబ్బు దాచుకోవడం దగ్గర నుండి ఆర్థిక లావాదేవీలు, ఇతర ప్రయోజనాల గురించి కాస్తంత అవగాహన పెరిగిపోయింది ప్రజల్లో. బ్యాంకుకు వెళ్లకుండానే లావాదేవీలు జరుపుతున్నారు నేడు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యుపిఐ వంటి సదుపాయాలు అందుబాటులోకి విసృత్తంగా వచ్చాయి ఇప్పుడు. అలాగే కస్టమర్లకు లోన్స్ అందిస్తున్నాయి బ్యాకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు. ఇప్పుడు క్రెడిట్ కార్డు కానీ, పర్సనల్ తీసుకోవాలనుకున్నట్లయితే.. ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే బ్యాంక్, నాన్ బ్యాంకింగ్ సంస్థలకు ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకు వచ్చింది. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ విషయంలో కొన్ని నిబంధనలు తీసుకువచ్చింది. వాటి గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది.

లక్ష రూపాయల పర్సనల్ లోన్ తీసుకుంటే.. ఆ బ్యాంక్ మన లోన్ తరుఫున ష్యూరిటీని ఆర్బీఐకి చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఆ లక్ష తీసుకుని ఎగ్గొట్టేస్తే.. బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము నష్టపోకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు. లోన్ తీసుకున్న వారు డబ్బు చెల్లించకపోయినా, బ్యాంక్ యాక్టివిటీస్ ఆగి పోయే పరిస్థితి ఉండకుండా ఉండేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేస్తోంది. దీన్ని రిస్క్ వెయిటేజ్ అంటారు. ఉదాహరణకు లక్ష రూయాలు బ్యాంక్ లోన్ తీసుకుంటే.. బ్యాంక్ మరో లక్ష తన దగ్గర క్యాపిటల్‌గా చూపించాలి. ఒక వేళ పది లక్షలయితే.. పది లక్షల రూపాయలను దానికి వ్యతిరేకంగా క్యాపిటల్ ఫండ్ లో ఉంచాలన్నమాట. దీనిని విడిగా చూపించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వ బండ్లలో ఆమేరకు పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు ఆర్బీఐ తీసుకువచ్చిన రూల్ ఇదే.

ఇప్పటి వరకు రిస్క్ వెయిటేజ్ 100 శాతంగా ఉంటే.. ఇప్పుడు 25 బేసిక్ పాయింట్లు పెంచి 125 శాతానికి తీసుకువచ్చింది. ఇది పర్సనల్ లోన్స్‌కి, క్రెడిట్ కార్డులకు వర్తిస్తుంది. అయితే గృహ రుణాలు, విద్యా రుణాలకు, వాహన రుణాలకు ఇది వర్తించదు. అంటే ఇంతవరకూ ఏదైనా బ్యాంక్ పదిలక్షల రూపాయల లోన్స్ ఇచ్చింది అనుకుంటే.. అప్పుడు ఇప్పుడు 125% రిస్క్ వెయిటేజ్ ఉండటం బ్యాంకులు పది లక్షల లోన్స్ ఇస్తే.. 12,50,000 రూపాయల ప్రభుత్వ బాండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే తమ ప్రొవిజన్ పెంచుకోవాల్సి ఉంటుంది. పాత, కొత్త లోన్స్ కు ఇది వర్తిస్తుంది.  దీని వల్ల గతంలో లోన్స్ తీసుకున్న వారికి, తీసుకోవాలనుకున్న వారికి బ్యాంక్ వడ్డీ  రేట్లు మరింత పెరగనున్నాయి.

సెక్యూర్ చేసిన లోన్స్ మినహా క్రెడిట్ కార్డు లోన్స్, పర్సనల్ లోన్స్ వంటి అన్ని అన్ సెక్యూర్డ్ లోన్స్ ఖరీదైనవిగా మారతాయి. ఇప్పుడు బ్యాంకులు – బ్యాంకింగేతర సంస్థలు వినియోగదారుల రుణాలు ఇవ్వడానికి ఎక్కువ ప్రొవిజనింగ్ చేయవలసి ఉంటుంది. అలాగే, కొత్త ఆర్ బిఐ మార్గదర్శకాల ప్రకారం వాణిజ్య బ్యాంకుల క్రెడిట్ కార్డుల రిస్క్ వెయిటేజీ 100% నుంచి 150%కి పెంచాయి. బ్యాంకింగేతర క్రెడిట్ కార్డ్ రుణాలపై రిస్క్ వెయిటేజీ 125%గా ఉంటుంది.

Show comments