Problems With More Bank Acounts: ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే పెనాల్టీ పడుతుందా? రూల్స్ ఏం చెప్తున్నాయి?

ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే పెనాల్టీ పడుతుందా? రూల్స్ ఏం చెప్తున్నాయి?

Is There Any Problem If A Person Has More Bank Accounts: ఈరోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. అయితే ఒకటి కంటే కూడా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం భారీ పెనాల్టీ పడుతుందని ఒక వార్త వైరల్ అవుతోంది.

Is There Any Problem If A Person Has More Bank Accounts: ఈరోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. అయితే ఒకటి కంటే కూడా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం భారీ పెనాల్టీ పడుతుందని ఒక వార్త వైరల్ అవుతోంది.

ఒక మనిషి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే భారతీయ రిజర్వ్ బ్యాంకు భారీ జరిమానా విధిస్తుందని గత కొన్ని రోజుల నుంచి ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. ఆర్బీఐ కొత్త రూల్స్ ని తీసుకొచ్చిందని.. వాటి ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండకూడదని వైరల్ చేస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ వార్తలపై స్పష్టతనిచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఆర్బీఐ ఎలాంటి కొత్త మార్గదర్శకాలను జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే జరిమానా విధిస్తుందని ఎక్కడ చెప్పలేదని.. కాబట్టి అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.

అయితే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఆర్బీఐ పెనాల్టీ విధించదు గానీ ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఒక మనిషి ఎన్ని బ్యాంకు ఖాతాలు అయినా వాడచ్చు. కానీ ఎక్కువ ఖాతాలు ఉండడం వల్ల ప్రతి నెలా పెనాల్టీలు పడే అవకాశం ఉంది. ప్రతీ బ్యాంకు ఖాతాదారులకి మినిమమ్ బ్యాలన్స్ మెయింటెయిన్ చేయాలన్న నియమం పెడతాయి ఆయా బ్యాంకులు. దీని కోసం ప్రతి నెలా మినిమమ్ బ్యాలెన్స్ అనేది బ్యాంకులో ఉంచాలి. ఆ బ్యాంకు ఖాతాలో శాలరీ పడుతుంటే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనవసరం లేదు. కానీ శాలరీ ఖాతా కాకుండా వేరే ఖాతాలు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రతి నెలా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలి. లేదంటే బ్యాంకులు పెనాల్టీలు విధిస్తాయి. అది 500 రూపాయలు ఉండవచ్చు, 600 రూపాయలు ఉండవచ్చు. బ్యాంకులను బట్టి ఈ పెనాల్టీలు మారుతుంటాయి. ఆర్థిక నిపుణులు చెప్తున్న దాని ప్రకారం.. ఒక వ్యక్తికి మూడు కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటే సమస్యలు తలెత్తుతాయి.

ఎందుకంటే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ ఆర్థిక లావాదేవీలు జరుపుతుండాలి. లేదంటే బ్యాంకులు జరిమానా విధిస్తాయి. 6 నెలలకు పైగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకుండా, అసలు బ్యాంకు ఖాతాని వాడకుండా ఉంటే ఆ అకౌంట్ ని బ్యాంకు డియాక్టివేట్ చేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ బ్యాంకు ఖాతా కావాలంటే కొన్నిసార్లు నెగిటివ్ బ్యాలెన్స్ ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. అది బ్యాంకులను బట్టి ఉంటుంది. కొన్ని బ్యాంకులకి అయితే అలాంటి నిబంధనలు ఉండవు. అందుకే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటే వాటిని వాడుతూ ఉండాలి. అలానే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ ఉండాలి. పెనాల్టీలు పడకుండా ఉండాలంటే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడం, లావాదేవీలు జరుపుతుండడం చేయాలి. అవసరం లేదనుకుంటే బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.    

Show comments