రతన్ టాటా శునకం గోవా మృతిపై పోలీసులు ఏమన్నారంటే?

Ratan Tata: దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పెంపుడు శునకం ‘గోవా’ ఆయన పార్థీవ దేహం వద్ద దీనంగా కూర్చున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మరుసటి రోజు నుంచి గోవాపై ఇంటర్నెట్ లో రక రకాల రూమర్లు వస్తున్నాయి.

Ratan Tata: దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పెంపుడు శునకం ‘గోవా’ ఆయన పార్థీవ దేహం వద్ద దీనంగా కూర్చున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మరుసటి రోజు నుంచి గోవాపై ఇంటర్నెట్ లో రక రకాల రూమర్లు వస్తున్నాయి.

సాధారణంగా పెంపుడు జంతువులు యజమానులు అంటే ఎంత ప్రేమను కురిపిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా ఇంట్లో పెంచుకునే కుక్కలు తమ యజమానుల కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. అందుకే ప్రపంచంలో అత్యంత విశ్వాసం గల జంతువు ఏదీ అంటే వెంటనే కుక్క గురించి చెబుతారు. తమ యజమని చనిపోతే అవి పడే ఆవేదన మాటల్లో చెప్పలేం. కొన్ని కుక్కలు అన్నపానియాలు మానేసి యజమాని కోసం ఎదురు చూస్తూ సమాధుల వద్ద తనువు చాలించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఎంతో ప్రేమగా చూసుకునే కుక్క (గోవా) పై సోషల్ మీడియాలో రక రకాల రూమర్లు వస్తున్నాయి. తాజాగా వాటిపై ముంబై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ పోలీసులు ఏమన్నారంటే? వివరాల్లోకి వెళితే..

ప్రముఖ వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ అధినేత రతన్ టాటా(86) అనారోగ్యంతో అక్టోబర్ 9న కన్నుమూసిన విషయం తెలిసిందే. రతన్ టాటా ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక వేత్త మాత్రమే కాదు, గొప్ప జంతు ప్రేమికుడు. ఒకానొక సమయంలో తన పెంపుడు కుక్కల కోసం ప్రతిష్టాత్మకమైన అవార్డును సైతం సున్నితంగా తిరస్కరించిన గొప్ప వ్యక్తి. తాజాగా రతన్ టాటా మరణాన్ని తట్టుకోలేక మూడు రోజుల తర్వాత ఆయనకు ఎంతో ఇష్టమైన కుక్క గోవా చనిపోయినట్లు సొషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘ఇదో విచారకరమైన వార్త.. టాటాస్ పెంపుడు కుక్క గోవా ఆయన మృతి తట్టుకోలేక 3 రోజుల తర్వాత చనిపోయింది. అందుకే మనుషుల కన్నా కుక్కలు తమ యజమానులకు ఎక్కువ నమ్మకంగా ఉంటాయి’ అంటూ సోషల్ మీడియాలో ఒక మెజేస్ చక్కర్లు కొడుతుంది. ఈ రూమర్లపై రతన్ టాటా స్నేహితుడు శంతను నాయుడు, ఇన్‌స్పెక్టర్ సుధీర్ కుడాల్కర్ కుక్క క్షేమాన్ని ధృవీకరించారు.

రతన్ టాటా ఎంతో ముద్దుగా పెంచుకున్న కుక్క గోవా చనిపోయిందని వస్తున్న వార్తలపై ముంబై పోలీస్ ఆఫీసర్ సుధీర్ కుడాల్కర్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. రనత్ టాటా పెంపుడు కుక్క గోవా చాలా ఆరోగ్యంగా ఉంది.. దానికి ఎలాంటి సమస్య లేదు. గోవా చనిపోయినట్లు వస్తున్న వార్త నిజం కాదు. ప్రస్తుతం గోవా బాంబే హౌజ్ లో క్షేమంగా ఉంది. ఈ విషయం స్వయంగా రతన్ టాటా మిత్రుడు శంతను నాయుడు చెప్పారు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ని ప్రచారం చేయకండి అని ఇన్ స్టా వేదికగా కుడాల్కర్ కోరారు. ఒకరోజు రతన్ టాటా బిజినెస్ పనిపై గోవా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఒక చిన్న కుక్క పిల్ల చాలా దీనమైన పరిస్థితిలో ఆయనకు కనిపించింది. వెంటనే ఆ కుక్క పిల్ల వద్దకు వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించాడు. అప్పటి నుంచి ఆ కుక్క పిల్ల రతన్ టాటా వెంటే ఉంటూ వచ్చింది. దాన్ని తీసుకొని ఆయన ముంబైకి వచ్చారు.

గోవాలో దొరికింది కనుక ఆ కుక్కకు గోవా అని పేరు పెట్టుకొని ఎంతో మురిపంగా చూసుకుంటున్నారు. ముంబైలోని టాటా సన్స్ హెడ్ ఆఫీస్ బాంబే హౌస్ లో ఈ గోవా ఉంటుంది. రతన్ టాటా టూర్లకు వెళ్లసమయంలో ఆయన వెంట గోవా కూడా వెళ్తూ ఉండేది. టాటా చనిపోయే వరకు గోవా ఆయన వెంటే ఉంది.అందుకే ఆయన మరణాన్ని తట్టుకోలేక గోవా చనిపోయిందంటూ రక రకాల వార్తలు నెట్టింట పుట్టుకు వచ్చాయి. ఏది ఏమైనా శంతను నాయుడు, ముంబై పోలీసులు రతన్ టాటా పెంపుడు కుక్క గోవా క్షేమంపై పూర్తి క్లారిటీ ఇవ్వడంతో ఆయన అభిమానులు సంతోషంలో ఉన్నారు.

Show comments