రతన్ టాటా వీలునామా.. శంతను, పెట్ డాగ్, వంట మనిషికి కూడా వాటా..

Ratan Tata: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామా వెలుగులోకి వచ్చింది. తన ఆస్తులను ఎవరికి చెందాలో అందులో పొందుపరిచారు. పెట్ డాగ్, వంట మనిషికి కూడా వాటా కేటాయించారు.

Ratan Tata: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామా వెలుగులోకి వచ్చింది. తన ఆస్తులను ఎవరికి చెందాలో అందులో పొందుపరిచారు. పెట్ డాగ్, వంట మనిషికి కూడా వాటా కేటాయించారు.

బిజినెస్ టైకూన్ రతన్ టాటా అక్టోబర్ 9న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో దేశం దిగ్భ్రాంతికి లోనయ్యింది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ చరిత్ర పుటల్లో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంట్రాప్రెన్యూర్లకు ఆదర్శంగా నిలిచారు. టాటా కంపెనీని ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగేలా చేయడంలో టాటా చేసిన కృషి ఎనలేనిది. టాటా ప్రొడక్టులపై ప్రజల్లో నమ్మకం ఏర్పడడానికి కారణం రతన్ టాటానే అనడంలో సందేహం అక్కర్లేదు. దేశం కోసం, ప్రజల కోసం నిత్యం పరితపించిన వ్యక్తి రతన్ టాటా. సంపన్న కుటుంబంలో జన్మించిన్నప్పటికీ సాధారణ జీవితాన్నే గడిపారు. లగ్జరీ లైఫ్ కు దూరంగా ఉన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కోసం అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.

దాతృత్వానికి మారుపేరుగా నిలిచారు రతన్ టాటా. మరణానంతరం కూడా టాటా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కాగా వేల కోట్ల ఆస్తులు కలిగిన టాటా వీలునామాపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాటా తనకున్న 10 వేల కోట్ల ఆస్తులను ఎవరికి చెందాలో వీలునామా రాశారు. ఎవరికి ఎంత దక్కాలో వీలునామాలో పొందుపరిచారు. కుటుంబ సభ్యుల నుంచి పెంపుడు శునకం వరకు తన ఆస్తులను కేటాయించారు. శంతను నాయుడు, పెట్ డాగ్, వంట మనిషికి కూడా వాటా కేటాయించారు. జంతు ప్రేమికుడైన రతన్ టాటా తన పెట్ డాగ్ కోసం కొంత వాటాను కేటాయించారు. పెంపుడు కుక్క జర్మన్ షెపర్డ్ టిటోకు జీవితకాల సంరక్షణ కోసం ఆ వాటాను కేటాయించారని సమాచారం.

వంటవాడిగా పనిచేస్తున్న వంట మనిషి రాజన్ షాకు పెట్ డాగ్ బాధత్యలను అప్పగించినట్టు తెలుస్తోంది. అలాగే, ఆయన సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణులు షిరిన్, దినా జీజ్‌భోయ్‌లకు కూడా వీలునామాలో కొంత వాటాను కేటాయించారు. మిగిలిన ఆస్తిలో ఎక్కువ భాగం ఆయన సొంత ఫౌండేషన్‌కు కేటాయించారు. రతన్ టాటా వీలునామాలో 30ఏళ్లు తన బట్లర్‌గా పనిచేసిన సుబ్బయ్యకు కూడా వాటాను కల్పించారు. ఇక రతన్ టాటా యంగ్ ఫ్రెండ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడికి కూడా వీలునామాలో వాటా కేటాయించారు.

శంతనునాయుడు స్టార్టప్ ‘గుడ్‌ఫెలోస్’లో రతన్ టాటా తన వాటాను వదులుకున్నట్లు తెలిపారు. దీనితో పాటు శంతను విదేశీ విద్య కోసం తీసుకున్న లోన్ కూడా టాటా మాఫీ చేశారు. రతన్ టాటా సంపదలో ఎక్కువ భాగం టాటా సన్స్, టాటా గ్రూప్ వివిధ కంపెనీలలో ఆయన వాటాను టాటా ధార్మిక సంస్థకు బదిలీ చేయాలని పొందుపరిచారు. మరి రతన్ టాటా వీలునామాలో శంతను, పెట్ డాగ్, వంట మనిషికి కూడా వాటా కేటాయించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments