కుక్క ప్రాణాలు కాపాడండి అంటూ రతన్ టాటా పోస్ట్! ఇది కదా మానవత్వం!

కుక్క ప్రాణాలు కాపాడండి అంటూ రతన్ టాటా పోస్ట్! ఇది కదా మానవత్వం!

ప్రముఖ దిగ్గజ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ మాజీ చైర్మన్ గా రతన్ టాటా గురించి అందరికీ తెలిసిందే. విశ్వసనీయతకు మారు పేరుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రతన్ టాటాకు మూగ జీవులంటే ఏనలేని ప్రేమ, జాలి దయ అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆనారోగ్యంతో పాటు రక్తహీనతో బాధపడుతున్న ఓ కుక్కకు బ్లడ్ డొనర్ కావాలంటూ స్వయంగా రతన్ టాటా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

రతన్ టాటా.. ఈ పేరు గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే.. దేశంలో ప్రముఖ దిగ్గజ పారిశ్రామిక వేత్తగా, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ మాజీ చైర్మన్ గా రతన్ టాటా అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా దేశంలో ఉప్పు మొదలు నుంచి బంగారం వరకు ఈ సంస్థలో ప్రవేశించని రంగం లేదనంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టాటా కంపెనీ ఉత్పత్తులపై భారతీయులకు కూడా ఎనలేని నమ్మకం.ఇక ఆ నమ్మకం వెనకాల రతన్ టాటా చేసిన కృషి కూడా ఎవరు మరువలేనిది. పైగా ఎంత ఎదిగినా ఒదిగే ఉండే గొప్ప లక్షణం రతన్ టాటాకే సొంతం. ఈ క్రమంలోనే.. తమ సంస్థలో పనిచేసిన ఉద్యోగులకు అండగా నిలబడటంతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ..పేదలకు సాయమందించడంలో రతన్ టాటాకు సాటి ఎవరు లేరు.

అంతేకాకుండా.. రతన్ టాటాకు సామాజిక కార్యక్రమాలతో పాటు మూగజీవులన్న ఎనలేని ప్రేమ, అమితమైన జాలి. ఈ క్రమంలోనే.. వాటి పేరు మీద ఇటీవలే ముంబాయి టాటా ట్రస్ట్‌ ఆధ్వరంలో దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ను కూడా ప్రారంభించారు. అలాగే ఆ హాస్పిటల్ ద్వారా రోడ్డుపై అనారోగ్యంతో బాధపడుతున్న పెంపుడు జంతువులకు ట్రీట్ మెంట్ చేసి, వాటిని పోషణ చూసుకుంటూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఇలా విశ్వసనీయతకు మారు పేరుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రతన్ టాటా సోషల్ మీడియాలో కూడా  ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా ముంబైలోని ఓ యానిమల్ హస్పిటల్ లో చేరిన ఓ కుక్క తీవ్ర అనారోగ్యంతో పాటు రక్తహీనతతో బాధపడుతుందని, దానికి రక్తం ఎక్కించడానికి బ్లడ్ డొనర్ కావాలని రతన్ టాటా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే ఎవరైనా ఈ పెంపుడు కుక్కలు పెంచుకునే వారు ఉంటే.. వాళ్ల కుక్క నుంచి రక్తదానంచేయాలని కోరారు. ఇక హాస్పిటల్ చేరిన కుక్క గురించి ఆయనే స్వయంగా బ్లడ్ డోనర్ కావాలని పోస్ట్ పెట్టడంతో.. మరోసారి ఆయనకు జంతువులపై ఎంత ప్రేమ ఉందో వైరల్ అయ్యిది. ఇకపోతే ప్రస్తుతం రతన్ టాటా చేసిన పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, ఆనారోగ్యనికి గురైన ఓ కుక్కకు బ్లడ్ కావాలంటూ రతన్ టాటా పోస్ట్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments